రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి | Road accident one men dead | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

Oct 14 2016 9:25 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండలంలోని తుంగమడుగుల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు శుక్రవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంకు చెందిన సుర్లం వెంకటరమణ(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం అడ్డతీగల నుంచి వై.రామవరం వైపు Ðð ళుతున్న చవిటిదిబ్బలు నివాసి చెలికాని రమేష్, అనుకులపాలెం నుంచి

అడ్డతీగల : 
మండలంలోని తుంగమడుగుల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు శుక్రవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంకు చెందిన సుర్లం వెంకటరమణ(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం అడ్డతీగల నుంచి వై.రామవరం వైపు Ðð ళుతున్న చవిటిదిబ్బలు నివాసి చెలికాని రమేష్, అనుకులపాలెం నుంచి అడ్డతీగల వస్తున్న సుర్లం వెంకటరమణల మోటార్‌ బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలైన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా తీవ్రంగా గాయపడిన చెలికాని రమేష్‌ను 108లో తొలుత అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు.అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement