ఆర్ఎంపీలపై ఎందుకంత కక్ష ? | rmp's Protest | Sakshi
Sakshi News home page

ఆర్ఎంపీలపై ఎందుకంత కక్ష ?

Sep 21 2016 12:28 AM | Updated on Aug 30 2018 6:04 PM

ఎక్కడో తప్పు జరిగితే మెత్తం ఆర్ఎంపీలను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఆర్ఎంపీలు మండి పడ్డారు.

అనంతపురం సిటీ: ఎక్కడో తప్పు జరిగితే మెత్తం ఆర్ఎంపీలను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఆర్ఎంపీలు మండి పడ్డారు.  మంగళవారం స్థానిక సాయినగర్లోని ఆర్ఎంపీల యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోఆర్ఎంపీల జిల్లా అధ్యక్షులు జి.ఎస్ ప్రసాద్, సుధాకర్లు మాట్లాడారు.
 
తమ అవసరం గుర్తించి  429 జీవోని తీసుకువచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా రూ.2 కోట్లా 32 లక్షలతో వేలాది మంది ఆర్ఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ కోర్సుల కింద శిక్షణ ఇప్పించారన్నారు. ఎక్కడో ఒక ఆర్ఎంపీ తప్పు చేశాడని మెత్తం వ్యవస్థనే నిర్భందించాలని చూడటం సరికాదన్నారు. తాజాగా హిందూపురంలో ఒకరు ప్రభుత్వాస్పత్రిలో డెంగీతో మరణించారనీ, అలాగని ఆ ఆస్పత్రిని మూసేయించడం ఎంత వరకు న్యాయమో జిల్లా కలెక్టరే చెప్పాలన్నారు. ఆర్ఎంపీలపై జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం వారు నగరంలో ర్యాలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement