breaking news
Registered Medical Practioner (RMP)
-
సోదరికి అన్యాయం చేశాడని..
సాక్షి, పశ్చిమగోదావరి : భీమవరంలో కలకలం సృష్టించిన ఆర్ఎంపీ హత్యకేసులో పోలీసులు ఐదురుగురిని అరెస్టు చేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తమ సోదరికి అన్యాయం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఆర్ఎంపీ నరసింహమూర్తి బావమరదులు అతన్ని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన వారం క్రితం జరుగగా తాజాగా వెలుగులోకొచ్చింది. భీమవరం పట్టణంలోని చినరంగనిపాలెంకు చెందిన మామిడిశెట్టి నరసింహమూర్తి(36) శ్రీనివాస్ సెంటర్లో శివప్రియ ప్రాథమిక కేంద్రం నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం రాజరాజేశ్వరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. రాజరాజేశ్వరితో విభేదాలు రావడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు జన్మించిన ముగ్గురు ఆడపిల్లలు అతడితోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజ రాజేశ్వరి.. పిల్లలను చూసేందుకు వస్తుండేది. అయితే తన సోదరిని వదిలేసి వేరే మహిళను వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న రాజరాజేశ్వరి సోదరులు దోనబోయిన లక్ష్మీ నారాయణ, నరసింహరావు నరసింహమూర్తిని చంపాలని కుట్ర పన్నారు. ఈనెల 4వ తేదీన నరసింహమూర్తిన కారులో ఎక్కించుకుని తూర్పుగోదావరి జిల్లా వైపు తీసుకువెళ్లారు. కారులోనే అతని పీక నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి బిక్కవోలు-సామర్లకోట మధ్యలో ఉన్న ఒక పంట బోదెలో విసిరేశారు. రెండు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో రెండో భార్య స్వప్నమంజరి భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. లక్ష్మీ నారాయణ, నరసింహరావుపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ హరికృష్ణ దర్యాప్తు ప్రారంచి దోనబోయిన లక్ష్మీనారాయణ, నరసింహరావులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు. -
ఏడుస్తున్నాడని వెళితే.. ప్రాణం తీశాడు!
నంద్యాల(కర్నూలు): ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఆరు నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఎస్ఐ నవీన్‌బాబు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనపేటకు చెందిన పరమేశ్వరి, ఓబులయ్య కుమారుడు జగన్‌కు ఆరు నెలల వయసు. మంగళవారం రాత్రి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ పర్ల దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. కడుపునొప్పితో బాధపడుతున్నాడేమోనని, మందులు వాడితే తగ్గిపోతుందని భావించారు. చిన్నారిని పరీక్షించిన ఆర్ఎంపీ సిరప్లు, మందులు రాసిచ్చాడు. అతను ఇచ్చిన సైక్లోఫాం డ్రాప్స్ చిన్నారి జగన్‌కు వేసిన ఐదు నిమిషాలకే శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయపడి పోయిన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్ఎంపీ ఇచ్చిన మందులను పరిశీలిస్తే సైక్లోఫాం డ్రాప్స్ గడువు తేదీ (ఎక్స్పైర్ డేట్) 2016 నుంచి జూన్ 2018 వరకే ఉంది. చిన్నారికి తప్పుడు వైద్యం చేసి.. మరణానికి కారణమైన ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి పరమేశ్వరి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్ఎంపీల ధనదాహం
యాదగిరిగుట్ట(ఆలేరు) : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎలా ంటి అనుభవం లేకున్నా .. తమకు తెలిసిన వై ద్యంతో ప్రజ లకు వైద్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఇటీవల కొంతమంది ఆర్ఎంపీలు డబ్బులకు ఆశపడి వ్యభిచార నిర్వాహకులతో చేతులు క లిపి చిన్నారులకు హర్మోన్గ్రోత్ ఇం జక్షన్లు ఇచ్చి అక్రమంగా సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వ్యభిచారగృహాల్లో జ్వరా లు, అస్వస్థతకు గురైన మహిళలకు ఇంటింటికి వెళ్లి వైద్యం చేసే ఆర్ఎంపీలు నేడు పట్టణంలో ఆస్పత్రులను సైతం ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఎంతగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది. అసలు ఏం జరుగుతోంది.. యాదగిరిగుట్ట పట్టణంలో జూలై 30వ తేదీన ఓ చిన్నారిని చిత్రహింసలు పెడుతున్నట్లు తెలియడంతో ఎస్వోటీ, షీటీం, ఐసీడీఎస్, స్థానిక పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. దీంతో చిన్నారులను అక్రమంగా అమ్మకాలు చేస్తున్న వ్యభిచారగృహ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా రు. వారిని పోలీసులు లోతుగా విచారించడంతో చిన్నారుల శరీర ఎదుగుదలకు స్థానికంగా కొంత మంది వైద్యుల వద్ద హర్మోన్గ్రోత్కు సంబంధించిన ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తునట్లు తెలిపారు. దీంతో దర్యాఫ్తు ముమ్మరం చేసిన పోలీ సులు గురువారం పట్టణంలోని అనురాధ నర్సిం గ్‌హోం పై రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాలతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ దాడుల్లో సుమారు 48 హర్మోన్ గ్రోత్‌కు సంబంధించిన ఆక్సిటోసిన్ ఇంజకన్ల శాంపిల్స్ దొరికాయి. అంతే కాకుండా ఆర్ఎంపీ వైద్యుడిగా కొనసాగుతున్న అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ ఎలాంటి అనుమతులు లేకుండా సిజేరియన్, అబార్షన్, పిల్లలు కాకుండా ఆపరేషన్, హెన్రీయా ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో డీసీపీ రాంచంద్రారెడ్డి ఆస్పత్రి నిర్వాహకుడు నర్సింహను విచారించి రిమాండ్‌కు పంపారు. ఇంకా ముగ్గురు ఎక్కడ..? చిన్నారులకు హర్మోన్గ్రోత్ ఇంజక్షన్లు ఇస్తుంది నలుగురు డాక్టర్లని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. కానీ ఇప్పటికే అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ పట్టుబడ్డాడు. ఇంకా ముగ్గురు వైద్యులు ఎవరు.. వారి ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో ఒకరు భువనగిరి నుంచి గణేష్‌నగర్‌కు వచ్చి చిన్నారులకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తెలిసిం ది. యాదగిరిగుట్ట పట్టణంలోని మరో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు ఈ దారుణాలకు సహకరిస్తు ఇంజక్షన్లు ఇస్తున్నారని సమాచారం. దీంతో ఆ ముగ్గురు వైద్యులు ఎవరు అనే చర్చ యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా సాగుతోంది. మరో రెండ్రోజుల్లో ఆ ముగ్గురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యభిచారగృహాలకు సమీపంలోఆస్పత్రులు.. గణేష్‌నగర్‌లో ఉండే వ్యభిచార నిర్వాహకులకు అ త్యంత సమీపంలో అనురాధ నర్సింగ్ హోంతో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. దీంతో ఎక్కువగా ఈ ఆస్పత్రులకే వ్యభిచారగృహ నిర్వాహకులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దగ్గర్లో ఉన్న ఆర్ఎంపీలతో పరిచయం పెంచుకుని ఇలా ంటి నీచ సంస్కృతికి తెర తీసినట్లు స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా మంగళగిరి, జగిత్యాల, ఉభయగోదావరి, వరంగల్ ప్రాంతా ల్లో ఉండే వ్యభిచార నిర్వాహకుల బంధువుల ద్వా రా ఈ ఇంజక్షన్లు తెలుసుకుని ఇక్కడి చిన్నారులకు ఇస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరం
యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘ఆపరేషన్ ముస్కాన్‌ను ముమ్మరం చేసి ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే మరో ఆరుగురి సభ్యులను పట్టుకుని.. నలుగురి అమ్మాయిలను రక్షించాం. అంతేకాకుం డా బాలికల శారీరక ఎదుగుదలకు సంబంధించి ఇంజక్షన్లు ఇస్తున్న ఆర్ఎంపీని కూడా అరెస్టు చేశాం’ అని రాచకొండ డీసీపీ రాంచంద్రారెడ్డి తెలి పారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గురువారం ముఠాకు సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్ సీఐ అశోక్‌కుమార్, రూరల్ సీఐ అంజనేయులుతో కలిసి వెల్లడించారు. రెండ్రోజులుగా గుట్టలోని వ్యభిచార గృహా లపై జరుగుతున్న దాడులను కొనసాగిస్తామని చెప్పారు. పిల్లల అక్రమ రవాణాలో భాగంగానే గత నెల 31వ తేదీన పరారీలో ఉన్న ముగ్గురు ముఠా సభ్యులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి నలుగురు బా లికలను రక్షించామన్నారు. ఈ ఆపరేషన్ ప్రతి రోజు కొనసాగుతుందన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు పోలీస్ శాఖ శ్రమిస్తుందన్నారు. వ్యభిచారాన్ని యాదగిరిగుట్టలో నిర్మూలించాలనే ధృఢ సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ముఠా వద్ద దొరి కిన అమ్మాయిలను వైద్య పరీక్షల కోసం చిల్డ్రన్ హోమ్స్‌కు పంపిస్తామని వెల్లడించారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులు నాగలక్ష్మీ, కంసాని నరేష్, స్వప్న, కంసాని కుమారి, కంసాని రజిని, కంసాని ఎల్లయ్యలను కోర్టుకు పంపించి, ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా పీడీ యాక్టు పెడతా మన్నారు. 133 సెక్షన్ సీఆర్సీ ప్రకారంగా వారి ఇళ్లను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీ రిమాండ్ ఆపరేషన్లు అథారిటీ లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా పనిచేస్తున్న ఆర్ఎంపీ నర్సిం హను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధి దాటి ఆపరేషన్లు చేయవద్దని, కేవలం వారు చే యాల్సిన చికిత్స మాత్రమే చేయాలని హెచ్చరిం చారు. రెండ్రోజులుగా బాలికలకు ఇస్తున్న హర్మో న్ గ్రోత్‌కు సంబంధించిన సుమారు 48 ఇంజిక్షన్లు ఆస్పత్రిల్లో లభించినట్లు డీసీపీ వెల్లడించారు. తమ పిల్లలే అంటూ.. పట్టుబడిన ముఠా.. బాలికలను తమ పిల్లలే అని చెబుతుంటారని, వారిపేరు మీద ఆధార్, రేషన్ కార్డులు సొంతంగా సృష్టించుకున్నారని తెలి పా రు. కృష్ణ అనే ఓ బ్రోకర్ పలు సందర్భాల్లో తమకు పిల్లలను ఇచ్చారని మరో మాట చెబుతున్నారని వెల్లడించారు. అంతేకాకుండా వ్యభిచారగృహాల్లో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు దాడులు చేసే క్రమంలో నిర్వాహకులు బాలికలు, మహిళలను దాచి పెట్టడానికి వారి ఇండ్లలో కొంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. గృహాల్లో చేసు కున్న రంధ్రాల్లో లేక బాక్స్‌టైప్ గది.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్మించుకుని దాచిపెడతారన్నా రు. ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాలకు వెళ్లి న ముఠాను కూడా త్వరలోనే పట్టుకుని వారి వద్ద ఉన్న చిన్నారులను కాపాడుతామన్నారు. రికార్డులను పరిశీలిస్తున్నాం ప్రజ్వల పాఠశాలలో దాదాపు 30మంది చదువుకుంటున్నారని, ఇందులో ఇప్పటికే కొందరికి తీసుకొచ్చామని, పాఠశాలలో ఉన్న రికార్డులను పరిశీ లించి, వారు ఎవరి పిల్లలు అనే అంశాలపై విచారణ కొనసాగిస్తామన్నారు. పిల్లలు ఎక్క డి నుంచి వచ్చారనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ఏవరైన తమ పిల్లలు తప్పిపోయి గతంలో కేసులు ఉంటే వారు వచ్చి పోలీస్ శాఖను సంప్రదిస్తే పిల్లల ద్వారా డీఎన్ఏ టెస్టులు జరిపి అప్పగిస్తామన్నారు. యాదాద్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం దాడులు కొనసాగిస్తామన్నారు. అనురాధ నర్సింగ్ హోంపై ఎస్ఓటీ దాడులుయాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్ఓటీ(స్పెషల్ ఆపరేషన్ టీం) పోలీ సులు గు రువారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సం దర్భంగా ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, రాచకొండ సీపీ మహేష్‌భగవత్, ఎస్ ఓటీ ఓఎస్డీ రఫిక్ ఆదేశాలతో ఇటీవల వ్యభిచారగృహ నిర్వాహకుల వద్ద దొరికిన బాలికలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు అనురాధ నర్సింగ్ హోంలో ఇస్తున్నారని సమాచారం ఇచ్చారని వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడులు చేయగా ఇందులో 48 ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు దొరికాయని, అంతేకాకుండా శాంపిల్ మెడిసిన్స్ కూడా లభించాయని పేర్కొన్నారు. వీటితో పా టు సిజేరియన్, హెన్రియా, అబార్షన్ చేసినట్లు ఆస్పత్రిలో తెలిసిందన్నారు. ఆర్ఎంపీ నర్సిం హను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. -
బాలికను గదిలోకి లాక్కెళ్లి.. ఆర్ఎంపీ అకృత్యం
సాక్షి, కృష్ణా : పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఆర్ఎంపీ వైద్యుడు. ఈ సంఘటన సోమవారం ఉదయం కృష్ణాజిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ మొహిద్దీన్ కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో 8వ తరగతి చదివే ఓ బాలిక యకమురు స్కూల్‌కు వెళుతుండగా మొహిద్దీన్ తన ఆస్పత్రి గదిలోకి బలవంతంగా లాక్కువెళ్లాడు. ఎంతసేపటికి బాలిక బయటకు రాకపోవటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆర్ఎంపీ వైద్యుని గదిలోకి వెళ్లి చూడగా.. అతడు దుస్తులు లేకుండా ఉన్నాడు. స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
13ఏళ్ల బాలికపై వైద్యుడు అత్యాచారయత్నం
-
డోస్ పెరుగుతోంది
శివ్వంపేట(నర్సాపూర్) : మారుమూల గ్రామాల్లో పేదవారి ఆరోగ్యంతో ఆర్ఎంపీలు ఆటలాడుకుంటున్నారు. తెలిసీతెలియని వైద్యానికి అమాయకులు బలవుతున్నారు. పుట్టగొడుగుల్లా గ్రామాల్లో విచ్చలవిడిగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటూ కాసులు దండుకుంటున్నారు. స్థాయికి మించి చేసిన వైద్యానికి రెండు నెలల క్రితం శివంపేట మండల కేంద్రానికి చెందిన రాములు(48) వైద్యం వికటించి మృతి చెందాడు. అయినా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఉన్నాతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీళ్ల వైద్యానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. మండల పరిధిలో 50కిపైగా ఆర్ఎంపీలు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీలు తెలియకపోయినా అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దీనికితోడు మోతాదుకు మించి ఇంజక్షన్ల డోస్, మాత్రలు ఇస్తున్నారు. దీంతో ఉన్న రోగం అటుంచితే కొత్త రోగాల భారిన పడాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్లు అనాధికారికంగా మందుల విక్రయాలు కూడా జరుపుతున్నారు. పలు కంపెనీలు ఇచ్చే శాంపిల్ మందులు సైతం రోగులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రోగికి హైడోస్ మందులు ఇవ్వడం వల్ల త్వరగా తగ్గిపోతుందని నమ్మేవారికి ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇంకో అడుగు ముందుకేసి డెలివరీలు సైతం చేస్తున్నారు. రత్నాపూర్లో ఆర్ఎంపీ డెలివరీలు చేస్తున్న విషయం జిల్లా వైద్యాధికారి దృష్టికి వెళ్లగా తనిఖీ కోసం వైద్య సిబ్బంది రత్నపూర్ గ్రామానికి వెళ్లగా సదరు ఆర్ఎంపీ అసుపత్రికి తాళం వేసి ఉండడంతో సిబ్బంది వెనుతిరిగి వచ్చారు. కార్పొరేట్ కమీషన్ దందా.. గ్రామాల నుంచి రోగులను నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తే ఆయా ఆస్పత్రుల నుంచి ఆర్ఎంపీలకు కమీషన్ సైతం అందజేస్తున్నారు. రోగికి అయిన బిల్లులో కొంత పర్సెంటీజీ ఇవ్వడంతో వారు అవసరం లేకపోయినా పెద్ద ఆస్పత్రులకు పంపిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం సైతం ఆర్ఎంపీలను మచ్చిక చేసుకునేందుకు పలు బహుమతులు, పర్సెంటేజీలు ఇస్తున్నారు. పలు రకాల పరీక్షల కోసం తూప్రాన్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి అక్కడి నుంచి కూడా వాటా తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. పలు సందర్భాల్లో వైద్యం వికటించి రోగులు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకుంటున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రోగి బంధువులు ఆందోళన చేపడుతుండడంతో బాధిత కుటుంబాలకు ఆర్ఎంపీలు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నెల రోజుల క్రితం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేయడానికి రాగా ఆర్ఎంపీల స్థాయికి మించి వైద్యం గురించి ఆయన దృష్టికి తీసుకెల్లగా పలు క్లీనిక్‌లను తనిఖీ చేయగా హైడోస్ ఇంజక్షన్లు, మందులు ఇస్తున్న విషయాన్ని గుర్తించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటాం.. గ్రామాల్లో ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి వైద్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో తనీఖీలు నిర్వహించి స్థాయికి మించి వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. గర్భిణులకు చికిత్సలు అస్సలు చేయరాదని సూచించారు. ఆర్ఎంపీలు ఇష్టరాజ్యంగా చికిత్సలు నిర్వహిస్తున్న విషయంపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటేశ్వర్రావ్, జిల్లా వైద్యధికారి -
పోలీసుల వద్ద కొడుకు.. ఆగిన అమ్మ గుండె!
బుచ్చిరెడ్డిపాళెం: తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లి గుండె ఆగిపోయింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుబల్లికి చెందిన నన్నెం మాధవ్ డీవైðఎఫ్ఐ మండల కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నిరుద్యోగ సమస్యలపై బుధవారం ‘ఛలో విజయవాడ’ పేరిట డీవైఎఫ్ఐ కార్యక్రమం తలపెట్టింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లు మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. తాను విజయవాడకు వెళ్లడం లేదని, పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం ఏముందని ఆయన వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా తన తల్లి అనారోగ్యంతో ఉందని వారితో చెప్పడంతో కానిస్టేబుళ్లు ఎస్సైకు విషయాన్ని వివరించారు. దీంతో ఎస్సై ప్రసాద్‌రెడ్డి మంగళవారం రాత్రి పెనుబల్లికి వెళ్లి మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి బైండోవర్ చేశారు. కాగా, మాధవ్ తల్లి చిన్నమ్మ (60) ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మాధవ్ ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో తన తల్లికి స్వయంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తన కళ్లముందే కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వైద్యసేవలు కూడా అందకపోవడంతో చిన్నమ్మ గుండెపోటుతో మరణించింది. బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి మాధవ్‌కు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను వదిలిపెట్టారు. ఇంటికెళ్లిన మాధవ్ విగతజీవిగా మారిన తన తల్లిని చూసి విలపించారు. సీపీఎం నేతలతో కలసి తన తల్లి మృతదేహంతో పెనుబల్లి రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు ప్రవర్తించిన తీరుపై సీపీఎం నేతలు మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ ‘ఛలో విజయవాడ’కు వెళ్లడం లేదని చెప్పినా ఎస్సై ప్రసాద్‌రెడ్డి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు. తల్లి కళ్ల ముందు మాధవ్‌ను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మాధవ్‌తో అమానుషంగా వ్యహరించడంతోపాటు ఆయన తల్లి మృతికి కారకుడైన ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం నేతలు జొన్నలగడ్డ వెంకమరాజు, ముత్యాల గురునాధం, గండవరపు శ్రీనివాసులు, తాళ్ల వెంకయ్య, మన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిపోర్టులో హెచ్ఐవీ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు రిపోర్టులు ఇస్తూ రోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ రిపోర్టులను గుడ్డిగా నమ్ముతున్న కొంత మంది వైద్యులు టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను పూర్తి అవగతం చేసుకోకుండానే రోగాలను నిర్థారించేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మచిలీపట్నంలో గురువారం వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన ఒక యువకుడు కొంత మంది స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మచిలీపట్నం వచ్చాడు. స్థానికంగా మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి నలతగా ఉండటంతో 8న మచిలీపట్నం హైనీ హైస్కూలుకు సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. దీంతో అతడు సద్దాంకు పలురకాల టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. డాక్టర్ చెప్పిన విధంగానే ఆ యువకుడు ఆర్ఎంపీ వైద్యశాలలో ఉన్న ల్యాబ్‌లో రక్త నమూనాలను ఇచ్చాడు. మరుసటి రోజు ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టును వైద్యుడికి చూపించాడు. రిపోర్టు చూసిన వైద్యుడు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని పంపేశాడు. మానసిక ఒత్తిడితో కెమికల్స్ తాగే యత్నం తనకు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యుడు నిర్థారించటంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. స్నేహితులకు దూరంగా ఉంటూ మదనపడుతూ ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి మగ్గం పనులకు సంబంధించిన కెమికల్స్ కలుపుకుని తాగే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన స్నేహితులు అతడిని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్నేహితులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి హెచ్ఐవీకి సంబంధించిన పరీక్షలు చేయించారు. అన్ని రిపోర్టులు నెగిటివ్‌గానే వచ్చాయి. దీంతో స్నేహితులు గురువారం ఆర్ఎంపీ వైద్యుడిని నిలదీశారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీంతో సదరు వైద్యుడు ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్ వల్లే తప్పిదం జరిగిందని బుకాయించాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ ల్యాబ్ టెక్నీషయన్ బతిమిలాడడంతో స్నేహితులు శాంతించారు. -
ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన కేసులో ఆర్ఎంపీ డాక్టర్‌ను ఆదివారం నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్‌సుభాన్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన కె.రాంబాబు జ్వరంగా ఉండటంతో గతేడాది జూలై 13వ తేదీన పెద్దబజారు డైకస్‌రోడ్డులోని ఆర్ఎంపీ వైద్యుడు మిల్టన్కుమార్ భౌమిక్ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ అతడిని పరీక్షించి ఇంజెక్షన్ వేశాడు. కొద్దిసేపటికి రాంబాబు క్లీనిక్‌లోనే కుప్పకూలడంతో వైద్యుడు హుటాహుటిన అతడిని ఆటోలో రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రాంబాబును పరీక్షించిన డాక్టర్లు అతను మృతిచెందాడని నిర్ధారించారు. దీంతో అప్పట్లో చిన్నబజారు పోలీసులు ఈ ఘటనపై సెక్షన్ 174 సీఆర్పీసీ (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదుచేశారు. ఇటీవల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో రాంబాబు ఇంజెక్షన్ వికటించి మృతిచెందాడని నిర్ధారణ కావడంతో సెక్షన్ 174ను 304 (ఎ) ఐపీసీగా మార్పుచేశారు. ఆదివారం నిందితుడైన మిల్టన్కుమార్ భౌమిక్‌ను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వైద్యం పేరుతో క్షుద్ర పూజలు
మంచాల : వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన కోడి శ్రీనివాస్ పదేళ్ల క్రితం మంచాల గ్రామానికి ఆర్ఎంపీ వైద్యుడిగా వలస వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు నాటు వైద్యం చేసేవాడు. అధిక సంపాదన ఆశతో అమాయక ప్రజలను నమ్మించి క్షుద్ర పూజలు చేస్తుండేవాడు. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ మహిళ నగరంలోని కర్మన్‌ఘట్‌లో స్థిరపడింది. పదిహేను సంవత్సరాల వయస్సు గల ఆమె కుమారుడి మానసికస్థితి మార్పు విషయంలో నగరంలో అనేక వైద్యశాలలను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడం గ్రామంలోని అజీజ్‌బాబా అనే మంత్రగాడిని ఆశ్రయించింది. అతడికి సుమారు రూ.50వేల వరకు సమర్పించుకుంది. అయినా నయం కాకపోవడంతో అజీజ్‌బాబా మంచాలలో ఉంటున్న శ్రీనివాస్ వద్దకు పంపించాడు. ఖచ్చితంగా అతడు నయం చేస్తాడని చెప్పాడు. బాబా మాటలు నమ్మిన ఆ మహిళ తన కుమారుడిని తీసుకొని వచ్చి శ్రీనివాస్‌ను ఫిబ్రవరి నెలలో కలిసింది. నయం చేస్తానని చెప్పి ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించాడు. అందుకు ఆమె వద్ద నుండి రూ.లక్షకు పైగా వసూలు చేశాడు. ఈమధ్య కాలంలో ఆమె తన కొడుకుని తీసుకొని దుబాయిలో ఉంటున్న తన భర్త వద్దకు వెళ్లింది. దీంతో శ్రీనివాస్‌కు అందుబాటులోకి రాలేదు. అయితే శ్రీనివాస్ మాత్రం బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మీ కొడుకుకు నయం చేశాను, నాకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే మీ కొడుకుని తిరిగి అనారోగ్యానికి గురిచేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు చెందిన ఆ మహిళ సోమవారం మంచాలకు వచ్చి క్షుద్ర పూజలు చేసిన శ్రీనివాస్‌ను కలిసింది. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో బాధితురాలు మంచాల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంచాల సీఐ గంగారాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. పోలీసుల అదుపులో... క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీని వాస్, అతనితో పాటు కొయ్యలగూడంకు చెందిన అజీజ్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
చిత్తూరు, బంగారుపాళెం: ఉపాధ్యాయుని హత్య కేసులో నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించా రు. చెర్లోపల్లెకు చెందిన టీచర్ వాసుదేవన్ భార్య రమాదేవికి అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రమేష్‌తో వివాహేతర సం బంధం ఉంది. ఈ విషయం తెలిసిన వాసుదేవన్ భార్యను, రమేష్‌ను మందలించాడు. వారిలో మార్పు రాలేదు. వాసుదేవన్ ఈ విషయాన్ని రమేష్ భార్య ఉషారాణి దృషికి తీసుకువెళ్లాడు. ఆమె మూడు నెలలుగా భర్త రమేష్‌ను రమాదేవితో కలవనీయకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భర్త వాసుదేవన్ అడ్డు తొలగించుకోవాలని రమాదేవి ప్రియుడితో కలిసి పథకం పన్నింది. శనివారం వాసుదేవన్ భార్యాపిల్లలతో కలిసి బంగారుపాళెం మండలం బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం బైక్‌లో చెర్లోపల్లెకు వెళ్లివస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని రమాదేవి ప్రియుడి కి చెప్పింది. రమేష్ నూనెగుండ్లపల్లె సమీపంలో సుమోతో ఢీకొట్టి వాసుదేవన్(40)ను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకు నిదర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పారిపోయేందుకు కేజీ సత్రం బస్టాండ్ వద్ద ఉండగా రమేష్, రమాదేవిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. -
మీకింత.. మాకింత!
సాక్షి, సిటీబ్యూరో : వైద్యుడు భగవంతుడికి ప్రతిరూపంగా భావించే రోజుల నుంచి అందినకాడికి దండుకునే దుస్థితికి వచ్చింది ప్రస్తుత పరిస్థితి. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకోవడమే పరమావధిగా మారింది. డాక్టర్లకు బదులు.. బడా వ్యాపార సంస్థలు వైద్య రంగంలోకి అడుగుపెట్టడంతో ‘వైద్యో నారాయణ హరి’ అన్న పదానికే అర్థం వెతుక్కోవాల్సివస్తోంది. ప్రత్యేక మార్కెటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, ఆస్పత్రుల్లో బ్రాండింగ్ పేరుతో పని చేస్తున్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ వైద్యులు, కొందరు ఆర్ఎంపీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. రోగులను ఆస్పత్రికి పంపినందుకు ప్రతిఫలంగా చెల్లించిన బిల్లులో 25 నుంచి 30 శాతం వారికి చెల్లిస్తున్నారు. టార్గెట్‌కు మించి రోగులను పంపిన వైద్యులు, ఆర్ఎంపీలకు ఏడాదికోసారి విదేశీ టూర్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో కాక్‌టెల్ డిన్నర్లు, విలువైన గిఫ్ట్‌లు, ఆఫర్ చేస్తున్నాయి. అవసరం లేకపోయినా వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తూ రోగుల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేసి ఎవరి కమీషన్లు వారికి చెల్లిస్తున్నాయి. పేరున్న కార్పొరేట్ ఆస్పత్రులు కేవలం వైద్యులకు మాత్రమే కమీషన్లు చెల్లిస్తుండగా, జాతీయ రహదారుల వెంట కొత్తగా పుట్టుకొచ్చిన ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వైద్యులతో పాటు కొందరు ఆర్ఎంపీలకూ కమీషన్లు చెల్లిస్తున్నాయంటే వైద్యరంగం ఎంతటి దయనీయ దుస్థితికి దిగజారిందో అవగతమవుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నిజాలివీ.. హైదరాబాద్ నగర శివారులోని కుంట్లూరు, సాహెబ్‌నగర్‌లో వేర్వేరుగా క్లినిక్స్ నిర్వహిస్తున్న ఓ ఆర్ఎంపీ దంపతులు తమ వద్దకు వచ్చిన రోగులను హస్తినాపుర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి చెల్లించిన మొత్తం బిల్లుపై 25 శాతం కమీషన్ చెల్లిస్తున్నట్లు సదరు ఆర్ఎంపీ దంపతులే స్వయంగా అంగీకరించడం విశేషం. కొహెడ గ్రామంలోని మరో ఆర్ఎంపీ తమ వద్దకు వచ్చిన రోగులను నాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపుతున్నాడు. ప్రతిఫలంగా ఆస్పత్రి యాజమాన్యం రోగి బిల్లులో 30 శాతం ఆర్ఎంపీకి కమీషన్‌గా చెల్లిస్తున్నట్లు తెలిసింది. నందనవనంలో పని చేస్తున్న మరో ఆర్ఎంపీ తమ వద్దకు వచ్చిన రోగులను బైరామల్‌గూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి సిఫార్సు చేసి, సదరు యాజమాన్యం నుంచి 25 శాతం కమీషన్ పొందుతున్నట్లు తెలిసింది. జిల్లా, మండల కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు మొదలు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీల వరకు ఇదే వరస. అంబులెన్స్ డ్రైవర్లనూ వదలని ఆస్పత్రులు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లను ఆశ్రయించిన క్షతగాత్రులను, ఇతర రోగులను కూడా వదలడం లేదు. ఆపదలో ఉన్న వ్యక్తిని తమ ఆస్పత్రిలొ చేర్పించినందుకు అంబులెన్స్ డ్రైవర్‌కు కమీషన్లు చెల్లిస్తున్నారు. ఇలా రోజూ ఒక్కో కేసుకు రూ.1500 చొప్పున లెక్కగట్టి కమీషన్లు ముట్టజెప్పుతున్నాయి. విజయవాడ, శ్రీశైలం, ముంబై, వరంగల్, నాగార్జునసాగర్ వైపు వెళ్లే జాతీయ రహదారుల వెంట వెలిసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో అనేక ఔషధ కంపెనీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వెలిశాయి. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడ అందుబాటు ఉండటంతో నగర శివారు ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోగులు చికిత్సల కోసం ఇక్కడికి వస్తుంటారు. వీరిలో చాలా మందికి ఏ ఆస్పత్రిలో చేరాలనేదానిపై అవగాహన ఉండటంలేదు. దీంతో ఊర్లో అందరికీ తెలిసిన ఆర్‌ఎంపీనో లేదా పట్టణాల్లోని వైద్యుడినో ఆశ్రయిస్తుంటారు. తెలిసిన మనిషి కదా! కాస్త మంచి సలహా ఇస్తారని ఆర్ఎంపీ వద్దకు వెళ్తే.. చిన్న జబ్బుకు పెద్దపెద్ద ఆస్పత్రుల్లో చేర్పించి నిలువునా ముంచేస్తున్నారు. ఆర్ఎంపీ మాట విని మోసపోయా.. మా బావమరిది రంజిత్ (32) హఠాత్తుగా కిందపడడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాం. ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అప్పటికే రూ.1.5 లక్ష లు అప్పు చేసి బిల్లు చెల్లించాం. బిల్లు తగ్గించాల్సిందిగా కోరితే.. మీకు బిల్లు తగ్గిస్తే ఆర్ఎంపీకి కమీషన్ ఎలా ఇస్తామని చెప్పారు. బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో సదరు ఆస్పత్రి వైద్యసేవలు నిలిపివేసింది. దీంతో ఇటీవల గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాం. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం పొందుతున్నాం.– మహేష్. కొప్పుల, వరంగల్ జిల్లా చికిత్సలు నిలిపేశారు.. నా కుమారుడికి ఒంట్లో బాగులేకపోతే ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లాను. ఆయన గోదావరిఖనిలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రూ.2 లక్షలు చెల్లించాను. మరో రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత స్థోమత లేదని చెప్పడంతో చికిత్సలు నిలిపేసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. చేసేదేమీలేక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాను. – కనకలక్ష్మి, కమాన్‌పూర్, పెద్దపల్లి జిల్లా -
మాధాపూర్‌లో లింగనిర్ధారణ పరీక్షలు
‘‘ బేటీ బచావో.. బేటీకో పడావో అంటూ పాలకులు అవగాహన కల్పిస్తున్నా.. ఆడపిల్లని తెలిస్తే చాలు పురిట్లోనే చిదిమేస్తున్నారు... లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం.. ఎవరైనా వైద్యులు ఆ పరీక్షలు నిర్వహించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇది ఉన్నతాధికారుల హెచ్చరిక.. అయినా ప్రజలను ఎంతగా చైతన్య పరుస్తున్నా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా..తల్లి గర్భంలోనే చిట్టితల్లులను అంతమొందిస్తున్న ఘటనలు కోకొల్లలు.. మంగళవారం తుర్కపల్లి మండలంలో ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. తుర్కపల్లి (ఆలేరు) :లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్ఎంపీలతో సహా ఓ నర్స్‌ను ఎస్ఓటీ పోలీసులు సినీ ఫక్కీలో దాడిచేసి అరెస్ట్ చేశారు. వివరాలు.. తుర్కపల్లి మండలం మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రిలో కొన్ని రోజులుగా లింగానిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆడశిశువని తేలితే తల్లిగర్భంలోనే పిండాన్ని అంతమొందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఈ ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన కేసును రాచకొండ ఎస్ఓటీ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ రఫీకి అప్పగించారు. సినీఫక్కీలో.. ఎస్ఓటీ సీఐ గంగాధర్ నేతృత్వంలో పోలీసులు బృందంగా ఏర్పడి మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రిపై నిఘా పెట్టారు. ఆస్పత్రి కార్యకలాపాలు, ఎక్కడెక్కడి నుంచి ఈ ఆస్పత్రికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేందుకు వస్తున్నారని తెలుసుకున్నారు. అనంతరం గర్భంతో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ జయమ్మను నెల క్రితం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారంలో గల శ్రీదేవి నర్సింగ్ హోమ్‌కు పంపించారు. అక్కడ ఉన్న ఆర్ఎంపీ సుధాకర్ పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం ఏమీ కనబడడం లేదు.నెల రోజుల తర్వాత రావాలని సూచించాడు. అందుకు రూ. 16వేలు ఖర్చవుతుందని తెలిపాడు. పక్కా ప్లాన్‌తో.. ఆర్ఎంపీ సూచన మేరకు పోలీసులు నెలరోజుల పాటు నిరీక్షించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకాన్ని రచించారు. అనుకున్న విధంగా మహిళా కానిస్టేబుల్ జయమ్మకు రూ. 16వేలు ఇచ్చి భోగారం ఆస్పత్రికి పంపించారు. అక్కడి ఆర్ఎంపీ సుధాకర్ లింగానిర్ధారణ పరీక్ష నిమిత్తం జయమ్మను తుర్కపల్లి మండలం మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రికి తిసుకువచ్చాడు. అనంతరం పరీక్షలు నిర్వహిస్తుడగా ఎస్టీఓ సీఐ గంగాధర్, స్థానిక ఎస్ వెంకటయ్య, హెడ్ కానిస్టేబులు శ్రీరాములు, వైద్యాధికారి చంద్రారెడ్డి, పీసీలు ఇబ్రహీం, చంద్రశేఖర్, అరుణరెడ్డి ఆకస్మికంగా దాడులు నిర్వహించి సూర్య ఆస్పత్రి యజమాని ఆర్ఎంపీ నర్సింగ్రావును, మరో ఆర్ఎంపీ సుధాకర్‌ను, నర్స్‌గా పనిచేస్తున్న ధీరవత్ సోనియాను అదుపులోకి తీసుకున్నారు రూ. 70వేల నగదుతో పాటు లింగనిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానర్, ప్రింటర్, మానిటర్‌తో పాటు విలువైన పత్రాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. -
మోకాలి నొప్పితో వెళితే.. వికలాంగులయ్యారు
-
క్లినిక్‌కు వెళుతూ...
లావేరు: జాతీయ రహదారిపై బెజ్జిపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని రణస్థలం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మావుడూరు వేణు(58) మృతి చెందాడు. బెజ్జిపురం గ్రామంలో ఉన్న క్లినిక్‌కు వెళ్లేందుకు ద్విచక్రవాహనంతో ఇతడు జాతీయ రహదారిని దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనకు సంబంధించి లావేరు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మావుడూరు వేణు అనే వ్యక్తి 15 సంవత్సరాలు క్రితమే రణస్థలం గ్రామానికి వెళ్లిపోయి అక్కడ నివాసం ఉంటున్నాడు. బెజ్జిపురం గ్రామంలో క్లినిక్ పెట్టుకున్నాడు. రోజూ రణస్థలం నుంచి బెజ్జిపురం గ్రామంలోని క్లినిక్‌కు వచ్చి వెళుతున్నాడు. అదేవిధంగా శనివారం ఉదయం కూడా వేణు తన ద్విచక్రవాహనంతో క్లినిక్‌కు వస్తుండగా బెజ్జిపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన లారీ ఇతడిని బలంగా ఢీకొని కొంతదూరం ఈడ్చుకువెళ్లింది. తలకు బలమైన దెబ్బ తగిలి సంఘటనా స్థలంలోనే వేణు మృతి చెందాడు. బైక్ ఎక్కడికక్కడ విరిగిపోయింది. డ్రైవర్ అతివేగంగా లారీని నడపటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ప్రమాద విషయం తెలుసుకున్న లావేరు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి జాతీయ రహదారిపై అడ్డంగా ఉన్న లారీని పక్కకు తీసివేయించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. లావేరు ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన భార్య, పిల్లలు ఆర్ఎంపీ వైద్యుడు వేణు మృతి చెందడంతో అతని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రణస్థలం, బెజ్జిపురం గ్రామాల్లో ఉన్న మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించారు. బెజ్జిపురం గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆర్ఎంపీ వైద్యుడు మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. -
ఆ మెడికల్ సర్టిఫికెట్స్ చెల్లవు
సాక్షి, న్యూఢిల్లీ : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(ఎస్ఎమ్సీ) ఆమోదం పొందని వ్యక్తి జారీ చేసే మెడికల్ లేదా ఫిట్నెస్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో ఈ మేరకు రాత పూర్వక సమాధానం ఇచ్చారాయన. పాథలాజీలో పీజీ చేసిన డాక్టర్ మాత్రమే ఫిట్నెస్ లేదా మెడికల్ సర్టిఫికెట్స్‌ను జారీ చేయగలరని చెప్పారు. ఇందుకు గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఉత్తర గుజరాత్లో పాథాలజిస్టుల అసోసియేషన్లు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పాథాలజీలో పీజీ కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ మాత్రమే మెడికల్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయగలరని పేర్కొంది. -
ఆర్ఎంపీ..ఎమ్మార్పీ!
ప్రతి మందుకూ ఓ రేటు ఉంటుంది. దానిని ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తాడు. అవసరమైనప్పుడు రోగులు.. ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అది వ్యాపారం. నైతికమైనది. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. కొందరు రిజిష్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ)లకు సైతం ధరను నిర్ణయించాయి. రోగులను తీసుకొస్తే వారి బిల్లులో 30 శాతం కమీషన్ ఇస్తామని ప్రకటించాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. కర్నూలు బస్టాండ్ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రుల అనైతిక వ్యాపారమిది. వీటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జంకుతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా వైద్యం చేయకూడదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. నేరుగా రంగంలోకి దిగి ఆర్ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వైద్యం చేసేందుకు అవకాశం లేని నేపథ్యంలో.. మీ వద్దకు చిన్న సమస్యలతో వచ్చే ప్రతీ రోగిని తమ వద్దకు తీసుకురావాలంటూ ఆర్ఎంపీలను సదరు ఆసుపత్రుల యజమానులు కోరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కర్నూలులోని ఒక స్టార్ హోటల్లో ఏకంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రధానంగా కర్నూలు బస్టాండుకు సమీపంలోని ఆసుపత్రులు ఈ సమావేశాలను ఏర్పాటు చేశాయని తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు విడిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్ఎంపీలకు మొత్తం మెడికల్ బిల్లులో 30 శాతంతో పాటు గోవా యాత్రకు కూడా పంపుతామని ఆఫర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా రోగులను ఆర్ఎంపీలు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో...! వాస్తవానికి సరైన శిక్షణ లేకుండా, వైద్యం తెలియకుండా కొద్ది మంది గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అంతేకాకుండా ఏకంగా నకిలీ డిగ్రీలతో ఆసుపత్రులను కూడా నెలకొల్పుతున్నారు. ఇటువంటి నకిలీ డాక్టర్లను.. విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి పట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు కర్నూలు, ఆదోనితో పాటు గుడూరులో కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. కేవలం ప్రాథమిక చికిత్స ..అది కూడా సరైన శిక్షణ తీసుకున్న వారు మాత్రమే చేయాలని నవంబరు ఆఖరి వారంలో జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా వైద్యం అందించకూడదని... మెడికల్ షాపులను నిర్వహించకూడదని తెలిపింది. ఆర్ఎంపీలు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలతో కనీస వైద్యం అందించేందుకు కూడా ఆర్ఎంపీలు జంకుతున్నారు. దీంతో వారి ఆదాయం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితులల్లో ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆసుపత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆదాయం పడిపోయిన ఆర్ఎంపీలకు ఇప్పటివరకు ఇస్తున్న 10 నుంచి 20 శాతం పర్సంటేజీ కాకుండా ఏకంగా 30 శాతం పర్సంటేజీ ఇస్తామని ఆఫర్లు ప్రకటించాయి. అదేవిధంగా ఏ చిన్న సమస్యతో రోగి వచ్చినా తమ వద్దకు పంపించాలని పేర్కొంటున్నాయి. తద్వారా సదరు రోగి నుంచి పరీక్షల పేరుతో భారీగా వసూలు చేసి... ఆ బిల్లులో 30 శాతం ఇవ్వడంతో పాటు గోవా టూరుకు కూడా పంపిస్తామని ఆశలు కల్పిస్తున్నాయి. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు.. ఆర్ఎంపీలకు ఆశ కల్పించి తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కర్నూలు బస్టాండు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులు విడివిడిగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల అనంతరం సదరు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగినట్టు సమాచారం. అంతేకాకుండా కేవలం జ్వరంతో బాధపడుతున్న రోగిని కూడా డెంగ్యూ టెస్టుల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సదరు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా వెనకంజవేస్తున్నారు. -
ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం: చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లో విషాద సంఘటన జరిగింది. వైద్యం వికటించి 14 నెలల చిన్నారి మృతి చెందింది. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పార్శీగుట్టలో ప్రకాష్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతని వద్దకు మెహను ఉన్నీసా అనే 14 నెలల బాలికను వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే ప్రకాష్ చేసిన వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
'నా భార్య వేధిస్తోంది.. ఆదుకోండి'
సాక్షి, జగిత్యాల: భార్య వేధిస్తోందంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు సెల్‌టవర్ ఎక్కాడు. జగిత్యాల పట్టణంలో అజయ్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. భార్య వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని, విడాకులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. అక్రమ కేసులు పెట్టి భార్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ' నా భార్య వేధిస్తోంది.. విడాకులు ఇప్పించి ఆదుకోండి..' అంటూ చిట్టీలు రాసి సెల్ టవర్ నుంచి కిందకు విసురుతూ నిరసన తెలుపుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకి చేరుకుని అజయ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అది చట్టవిరుద్ధమే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు), పీఎంపీ(ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు)ల.. పేర్లకు ముందు డాక్టర్ పెట్టుకుని రెగ్యులర్ డాక్టర్లుగా చెలామణి అవుతుండటంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆర్ఎంపీలు, పీఎంపీలు పేరుకు ముందు డాక్టర్ ఉపయోగించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయంలో వైఖరేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య మండలి, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిల ధర్మాసనం ఉత్త ర్వులు జారీ చేసింది. ఆర్ఎంపీలు, పీఎంపీలు అందిస్తున్న ప్రాథమిక వైద్య సేవలను మాత్రం తప్పుపట్టలేమని పేర్కొంది. -
ఆర్ఎంపీ, పీఎంపీలను నియంత్రించాలి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం లేని ఆర్ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు)లను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. గ్రామాల్లో క్లినిక్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వహణకు అనుమతిస్తూ 2009లో జారీ చేసిన జీవో 1273ని రద్దు చేయాలని కోరుతూ హెల్త్‌కేర్ రీఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. నైపుణ్యం ఉన్న వైద్యులు నిర్వర్తించాల్సిన విధులను ఆర్ఎంపీలు, పీఎంపీలు నిర్వర్తిస్తున్నారని, వారిని నిరోధించాలని పేర్కొన్నారు. ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఇస్తున్న కమ్యూనిటీ పారా మెడికల్ సర్టిఫికెట్లను జారీ చేయకుండా ఆదేశించాలని కోరారు. వైద్య రంగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 50 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య మండలి, పారా మెడికల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, వీరి శిక్షణకు సంబంధించి ఎలాంటి రికార్డుల్లేవని తెలిపారు. -
ఆర్ఎంపీలకు లైసెన్సా?
కర్నూలు(హాస్పిటల్): తాము 15 సంవత్సరాలు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నామని, కానీ వైద్యం చేసేందుకు ఎలాంటి అర్హత లేని ఆర్ఎంపీలకు ఎలా లైసెన్స్ ఇస్తారని సీనియర్, జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెం.465ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ కాలేజీలోని సీఎల్జీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆసుపత్రి ఆవరణ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా రాజవిహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ వైద్యవిద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, తెలుగునాడు పార మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్ చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా కాసేపు రాస్తా ఆందోళన చేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52వేల మంది ఆర్ఎంపీల ఓట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వారు వైద్యం చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తోందని విమర్శించారు. వారు చేసే వైద్యంతో వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. పైగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదని తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన గాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తే గ్రామాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు జూడాలు తెలిపారు. అనంతరం జీఓ 465ను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించారు. వీరి ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ రామకృష్ణనాయక్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ సి. మల్లికార్జున, కోశాధికారి డాక్టర్ రంగయ్య, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు అనుదీప్, దీరజ్, శ్రీహరి, శివప్రసాద్, సతీష్ తదితరులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
- గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యం - పట్టించుకోని అధికారులు, పంచాయతీ సిబ్బంది - జ్వరాలతో అల్లాడుతున్న గ్రామీణులు - మందు బిళ్లలతో సరిపెడుతున్న వైద్యసిబ్బంది - ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు ఎమ్మిగనూరు రూరల్: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధిక శాతం గ్రామాల్లో మురుగు కాలువలు లేవు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురద, మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతోంది. వాటిని దోమలు ఆవాసంగా చేసుకుంటున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు దోమల మోత మోగుతోంది. వాటి కాటు వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తల్లడిల్లుతున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. తూతూమంత్రంగా గ్రామాలను సందర్శిస్తూ తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటగిరి, మసీదపురం, కందనాతి, సోగనూరు, ఎర్రకోట, కడిమెట్ల, ఏనుగుబాల, కడివెళ్లతో పాటు పలు గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. వెంకటగిరిలో 100 మంది, ఎర్రకోటలో 100 మంది, మసీదపురంలో 60, మిగిలిన గ్రామాల్లో 10నుంచి 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామాలకు ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా మందు బిళ్లలతో సరిపెడుతున్నారు. దీంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కోసారి ఆర్ఎంపీలను పిలిపించుకొని ఇంటి దగ్గరే సెలైన్ బాటిల్స్ పెట్టించుకుంటున్నారు. ఎమ్మిగనూరులో 50 పడకల ఆస్పత్రి, హాలహార్విలో పీహెచ్సీ ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఎర్రకోటలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్వరాల ప్రభావం ఉన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి..జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. లోపిస్తున్న పారిశుద్ధ్యం గ్రామాల్లో జ్వరాలు ప్రబలటానికి పారిశుద్ధ్య లోపమేనని పలువురు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లో వీధులు మురికికూపాలను తలపిస్తున్నాయి. ఇళ్ల ముందే అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వెదజల్లుతోంది. ఎస్.నాగలాపురం, మసీదపురం, వెంకటగిరి, పెసలదిన్నె, దేవబెట్ట, దైవందిన్నె, ఏనుగుబాల, సోగనూరు గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచం పట్టిన పెద్దకడబూరు – దాదాపు 200 మందికి జ్వరాలు పెద్దకడబూరు: విష జ్వరాలతో మండల కేంద్రం మంచం పట్టింది. వారం క్రితం కురిసిన వర్షాలకు మురుగునీరు రోడ్లపై నిలిచి పరిసరాలు కలుషితమయా్యయి. ఇక దోమలు కూడా వృద్ధి చెంది వ్యాధులకు కారణమయ్యాయి. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలలో దాదాపు 200మందికి పైగా రోగాల భారిన పడ్డారు. ఆర్థిక స్థోమత లేక స్థానిక ఆర్ఎంపీలతోనే చికిత్సలు పొందుతున్నారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వీడి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
వివాహితతో డాక్టర్ అసభ్య ప్రవర్తన
-
మహిళపై ఆర్ఎంపీ లైంగికదాడికి యత్నం
బొమ్మలరామారం (ఆలేరు): వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ ఆర్ఎంపీ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 27న కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ గాజులరామారంలోని ప్రజా నర్సింగ్ హోమ్‌కు తన తల్లితో వెళ్లింది. ఆస్పత్రి నిర్వాహకుడు (ఆర్ఎంపీ) ఇజాజ్ పాషా వైద్యపరీక్షల కోసమని ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో జరిగిన విషయాన్ని ఆమె తన భర్తకు తెలిపింది. బాధితురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీనకు ఫోన్ చేసి ఆస్పత్రికి వస్తున్నామని ఉండాలన్నాడు. దీంతో భయాందోళన చెందిన ఆర్ఎంపీ బాధితురాలి ఊరికి వెళ్లి తనది పొరపాటేనని చెప్పుకొచ్చాడు. దీంతో బాధితురాలి భర్త, మరో వ్యక్తి కలసి ఆర్ఎంపీపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తనని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆర్ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత మహిళ తనపై ఆర్ఎంపీ లైంగికదాడికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువర్గాలపైనా కేసులు నమోదైనట్లు తెలిసింది. -
మెడి‘కిల్లింగ్’!
– ఆర్ఎంపీ క్లినిక్‌లలో ఔషధాలు – నిబంధనలు ఉల్లంఘించి నిల్వలు – ప్రాణం మీదకు తెచ్చేలా వైద్యం చేస్తున్న పరిస్థితి – పట్టించుకోని ఆరోగ్య, ఔషధ నియంత్రణ శాఖలు – అడపాదడపా దాడులతో సరిపెడుతున్న వైనం అనంతపురం మెడికల్: ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామన్న ధ్యాస తప్పిస్తే వృత్తికి న్యాయం చేయాలన్న ఊసే లేదు. కళ్లముందే అమాయక ప్రజల ప్రాణాలు ‘అనంత’ వాయువుల్లో కలిసి పోతున్నా వాళ్లకు పట్టదు. వైద్య ఆరోగ్యశాఖ, ఔషధ నియంత్రణ శాఖల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో మెడి‘కిల్లింగ్’ జరుగుతోంది. రిజిస్ట్రర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ), మెడికల్ దుకాణాల నిర్వాహకులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు అడపాదడపా దాడులు చేసి చేతులు ముడుచుకోవడం మినహా చిత్తశుద్ధితో చేస్తోందేమీ లేదన్నది స్పష్టమవుతోంది. గోరంట్లలో ఓ ఆర్ఎంపీ నిర్వాకం కారణంగా అభంశుభం తెలియని చిన్నారి మృత్యువాత పడితే రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మందులు లభ్యం కావడం ఔషధ నియంత్రణ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ప్రథమ చికిత్స కేంద్రాలు, 1600కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. అయితే ఇక్కడ నిబంధనలను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన చోట ‘అంతకుమించి’ వైద్యం అందిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ఇక మెడికల్ షాపుల్లో అర్హత లేని వారు ఫార్మసిస్టులుగా కొనసాగుతూ ఇష్టారాజ్యంగా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. అర్హత లేని నకిలీ, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు, మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత కలెక్టర్ కోన శశిధర్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో క్లినిక్‌ల ముందు ప్రథమ చికిత్స కేంద్రాలని బోర్డులు వెలిశాయే కానీ వైద్యంలో మాత్రం మార్పు రాలేదని ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. - మూడు నెలల క్రితం కనగాపల్లికి చెందిన గాయత్రి (11) ట్యూషన్‌కు వెళ్లొచ్చి తలనొప్పిగా ఉందనడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన మాత్రలిచ్చి పంపిస్తే మరుసటి రోజు బాలిక ఆరోగ్యం క్షీణించింది. మళ్లీ అతడి వద్దకే తీసుకెళ్లగా విష పురుగు కుట్టిందని చేతులెత్తేశాడు. తీరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. - రెండు నెలల క్రితం అనంతపురంలోని పాతూరుకు చెందిన ప్రభాకర్ కడుపు నొప్పి, వాంతులు అధికమై మార్కెట్ సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. స్కానింగ్ చేయించుకుని రావాలని తన క్లినిక్‌లోనే ఉన్న స్కానింగ్ సెంటర్ స్లిప్పుల్లో రాసిచ్చాడు. పరీక్ష ఫలితం అపెండిసైటిస్. ఆపరేషన్ చేయాలని, ప్రైవేట్‌కు వెళ్తారా అని అడిగితే తమకంత స్థోమత లేదని, ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చారు. ఎంఎస్ వార్డుల్లో అడ్మిషన్ చేయించుకుని చికిత్స చేస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండా మూడ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యాడు. -
వైద్యో నారాయణో ‘హరీ’
– జిల్లాలో ఆర్ఎంపీల ఆగడాలు – ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు – తాజాగా గోరంట్లలో చిన్నారి మృతి – హద్దుదాటి వైద్యం చేస్తున్న వైనం – సాక్షి పరిశీలనలో బట్టబయలు – నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ ఇక్కడ కన్పిస్తున్నది అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో ఉన్న స్నేహ మెడికల్ షాప్. ఇందులోనే ప్రథమ చికిత్స కేంద్రం ఉంది. ఇక్కడే ఫ్యాన్సీ స్టోర్ కూడా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓ వ్యక్తి అనారోగ్యంగా ఉందని వస్తే ఇదిగో ఇలా బెంచీపైనే సెలైన్ ఎక్కించారు. కాసులకు కక్కుర్తి పడి ‘హద్దులు’దాటి వైద్యం చేశారు. వాస్తవానికి ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. అనంతపురం మెడికల్: గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ బూగానిపల్లికి చెందిన శంకర, రాధమ్మ దంపతుల కూతురు శ్రావణి (3)కి గత శుక్రవారం రాత్రి జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయం గోరంట్లలోని లక్ష్మీ వెంకటేశ్వర ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. పాపను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సిన ఆ ఆర్ఎంపీ ఇంజెక్షన్ వేసి పంపాడు. సాయంత్రమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి అదే ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం తీసుకెళ్లాలని సూచించగా మార్గంమధ్యలోనే శ్రావణి మృతి చెందింది. ఉదయం ఇంజెక్షన్ వేసినప్పటి నుంచి పాప ఆరోగ్యం క్షీణించిందని, మృతికి వైద్యుడే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తల్లి కడుపుకోత మాటల్లో చెప్పలేనిది. వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు నైవేద్యంగా పెట్టాల్సి వస్తోంది. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఆర్ఎంపీలు హద్దుదాటి వైద్యం చేస్తుండడంతో అమాయకులు బలవుతున్నారు. వైద్యో నారాయణో హరి అని ఆస్పత్రి మెట్లెక్కితే ప్రాణాలు ‘హరీ’ అంటున్నాయి. జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల ధనదాహం తారస్థాయికి చేరుతోంది. నిబంధనల మేరకు ఆర్ఎంపీ క్లినిక్‌లలో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ అడిగేవారు లేకపోవడంతో ఏకంగా అత్యవసర కేసులను ఎల్లవేళలా చూస్తామని బోర్డులే పెట్టేస్తున్నారు. గోరంట్లలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆదివారం అనంతపురంలోని పలు ‘క్లినిక్’లను ‘సాక్షి’ పరిశీలించగా అసలు బండారం బయటపడింది. అంతా కాసుల కక్కుర్తే ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో చేసుకున్న ముందస్తు ఒప్పందాలతో తమ వద్దకు వచ్చే వారిని ఆర్ఎంపీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరీక్షల పేరుతో ల్యాబ్‌లకు, మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల పంట పండించి అందినకాడికి వెనకేసుకుంటున్నారు. క్లినిక్‌లలోనే మందుల దుకాణాలు నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఏకంగా పడకలను సైతం ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కిస్తున్నారు. ప్రథమ చికిత్సను మరచి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం, రక్త, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలాంటివి అనంతపురం నగరంలోనే 50కి పైగా ఉన్నాయి. గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, కదిరి, గుత్తి, పుట్టపర్తి వంటి పట్టణాలే కాకుండా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనూ ఆర్ఎంపీలు ఆడిందే ఆటగా సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తుంటే కట్టడి చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ మామూళ్లు అందుతుండడంతోనే చూసీ చూడనట్లు వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ఆర్ఎంపీలు ఉన్నా నెలలో ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలా లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతున్నారు. అనంతపురం నగరంలోని ఎర్రనేలకొట్టాల, సోమనాథ్‌నగర్, సాయినగర్, రాజీవ్‌కాలనీ, పాతూరు తదితర ప్రాంతాల్లోని క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా వైద్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలలు నిర్వహిస్తుంటే మూసివేయాలన్న ఉత్తర్వులు ఉన్నా అమలు కావడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. ఇంజెక్షన్లు, సెలైన్స్ ఎక్కించకూడదు. క్లినిక్‌లలో బెడ్స్ ఉండకూడదు. పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల వైద్యంపై నిఘా ఉంచాలని మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాం. గోరంట్ల ఘటన బాధాకరం. అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. గుత్తిలో కూడా ఓ క్లినిక్‌పై ఫిర్యాదు వచ్చింది. దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
ఆర్ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వండి
వైద్య మంత్రికి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల జేఏసీ చైర్మన్, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ వైద్య మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు. శనివారం సచివాలయంలో వైద్యుల సమస్యలపై మంత్రి లక్ష్మా రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో వైద్యుల జేఏసీ భేటీ అయింది. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టే పలు పథకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభైవేల మంది శిక్షణ పొందిన ఆర్ఎంపీ, పీఎంపీలను ఉపయోగించుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వని వారికి తక్షణమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కనకయ్య, జూపల్లి రాజేందర్, శంకర్ ముదిరాజ్, బాల బ్రహ్మచారి, వెంకట్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
శంకర్‌దాదా ఆర్ఎంపీ
► పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు ► ఆర్ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్న పల్లె జనం ► వచ్చీరాని వైద్యంతో మందులిస్తున్న ఆర్ఎంపీలు ► ఫిరంగిపురంలో చూపు కోల్పోయిన వివాహిత ► జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే దుస్థితి పొద్దుగాల నుంచి చంటోడు ఒకటే ఏడుస్తున్నడు..వళ్లు పట్టుకుంటే కాలిపోతాంది. చేతిలోనా పైసల్లేవు. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళదాం పదయ్యా..ఊరుకోవే..అక్కడికెళితే ఎవరుంటరే..బిడ్డను పట్టించుకునే నాథుడుంటడా..యాడో ఒక చోట అప్పు పట్టకొస్తా..ఊళ్లో ఉన్న డాక్టర్ బాబు దగ్గరకెళదాం..అంటూ పిల్లాడిని చంకనెత్తుకుని పరుగులు పెట్టారు దంపతులు. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి గ్రామంలో నిరుపేదల దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ మొద్దునిద్రలో జోగుతుంటే..ఆర్ఎంపీలే ఎంబీబీఎస్లైపోతున్నారు. తలనొప్పిగా ఉందంటే మోకాలుకు మందులిచ్చి డాక్టర్ బాబులుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆర్ఎంపీలు తమకు తెలిసిన స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారం మందులు రాస్తున్నారు. నిబంధనలకు చెల్లు చీటీ ఆర్ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్‌ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. ఆర్ఎంపీ వైద్యంతో చూపు కోల్పోయిన మహిళ ఈ నెల 13వ తేదీ జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్‌ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువగా జరుగుతున్నా బాధితులు బయటపడడం లేదు. ఆర్ఎంపీలు ఇచ్చిన మందులతో సైడ్ ఎఫెక్ట్ వచ్చినా రోగులు గుర్తించలేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఈ పాపం వైద్యులదే.. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆర్ఎంపీ కుటుంబం ఆత్మహత్య
♦ ఆర్థిక ఇబ్బందులు తాళలేక అఘాయిత్యం ♦ భార్యాభర్తలు, కుమార్తె మృతి నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సామల లక్ష్మీనారాయణ(50) స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. తల్లిదండ్రుల వద్ద చిన్న కుమార్తె సుప్రజ ఉంటోంది. కొన్ని రోజులుగా లక్ష్మీనారాయణ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణ తన భార్య అలివేలు(45), కుమార్తె సుప్రజ(23)లతో కలసి బుధవారం రాత్రి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరం దేవాలయానికి వెళ్లి అక్కడ జాగారం చేశారు. గురువారం తెల్లవారుజామున నవాబ్‌పేటకు బయలుదేరారు. గ్రామ సమీపంలో పొలం వద్దకు వచ్చి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు సుప్రజను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. రామేశ్వరం వెళ్లొస్తానని చెప్పిన కొడుకు శాశ్వతంగా దేవుడు దగ్గరికి వెళ్లాడంటూ ఆయన తల్లి రంగమ్మ గుండెల విసేలా రోదించింది. కాగా, లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ నవాబుపేట పట్టణ మాజీ అధ్యక్షుడు. బాధిత కుటుంబాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. -
నకిలీ లేబుళ్ల గుట్టురట్టు
– ఎంఆర్పీ కన్నా అధిక వసూళ్లు – ముగ్గురు నిందితులు రిమాండ్‌కు తరలింపు ఎమ్మిగనూరురూరల్: గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న నకిలీ లేబుళ్ల గుట్టు రట్టయ్యింది. కొంద మంది ఆర్ఎంపీలు కలసి డబ్బు కోసం లేబుళ్లు తయారు చేస్తూ చివరకు పోలీసుల వలలో చిక్కుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగమంతా ఎమ్మిగనూరు పట్టణంలో చోటుచేసుకోవటంతో కలకలం రేపింది. శనివారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ జీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు...పట్టణంలోని మిలటరీ కాలనీకి చెందిన నాగేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. గుడేకల్‌కు చెందిన మరో ఆర్ఎంపీ గురుస్వామితో నకిలీ లేబుళ్ల తయారీకి పన్నాగం పన్నారు. మూడు నెలలుగా వీటిని ఎమ్మిగనూరు పట్టణం ద్వారకమాయి ఫ్లెక్సీ షాప్‌లో తయారు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. జెంటామైసిన్ అనే టైఫాయిడ్ ఇంజక్షన్ సంబంధించిన లేబుల్స్‌ను తారుమారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ లేబుళ్లతో తయారు చేసిన మందు సీసాలను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెడికల్ షాప్‌లో జెంటామైసిన్ సీసాపై ఎంఆర్పీ ధర రూ. 6 కాగా, నిందితులు దీనిపై ఉన్న లేబుల్‌ను తొలగించి నకిలీ లేబుల్‌ను అతికిస్తున్నారు. వీరు తయారు చేసిన లేబుల్‌పై ఇంజక్షన్ ఖరీదు రూ.100 నుంచి రూ.300 వరకు నిర్ణయించారు. ఇలా నకిలీ లేబుల్స్ అతికించిన సీసాలను ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ..గుట్టు రట్టు చేశారు. నాగేష్ ఇంట్లో 110 ఖాళీ సీసాలు, ప్రింట్ చేసిన నకిలీ లేబుల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆదోని డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదా ఖలందర్‌కు అప్పగించారు. ఆర్ఎంపీలు నాగేష్, గురుస్వామి, ద్వారాకమాయి ఫ్లెక్సీ షాప్‌కు చెందిన సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రజలు.. ఆర్ఎంపీల దగ్గర ఇంజక్షణ్లు వేయించుకోకుండా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ, రూరల్ ఎస్ఐలు హరిప్రసాద్, వేణుగోపాల్లను సీఐ అభినందించారు. -
వైద్యంతో పాటు సామాజికసేవలూ అందించండి
రామచంద్రపురం: గ్రామీణ వైద్యులు సమాజంలో విడదీయలేని భాగంగా అల్లుకుపోయారని ఆర్ఎంపీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. వారు వైద్యంతో పాటు సమాజ సేవలోనూ ముందుండాలని సూచించారు. జిల్లా గ్రామీణ వైద్యుల సమావేశం శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఆదివారం నాయకులు నిడమర్తి సత్తిరాజు, కేఎస్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 29న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి గ్రామీణ వైద్యులు తమవంతు సహకరించాలన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి సభ్యులంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. మరో ముఖ్య అతిథిగా ప్రముఖ ఈఎ¯ŒSటీ నిపుణుడు డాక్టర్ ఏవీ క్రాంతికిరణ్ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ చర్యలు, చికిత్సా విధానాలను వివరించారు. ఆర్ఎంపీ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శోభ¯ŒSబాబు, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు వై. శ్రీనివాస్, కేటీవీ ప్రసాద్, ఈశ్వర్, ప్రసాద్, ఎ.శ్రీనివాస్, వాసంశెట్టి నాగేశ్వరరావు, చలపతి, కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, ఎ¯ŒSవీ కృష్ణారావు, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే మా కుమారుడు మృతి
బ్రహ్మంగారిమఠం: జ్వరం వస్తోందని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళితే ఆయన వేసిన సూది మందు వలన ఇంటర్ చదివే తమ కుమారుడు మృతి చెందాడని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు. బి.మఠానికి చెందిన నాగేంద్ర, పార్వతమ్మ దంపతులు కుంకుమ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి రాఘవేంద్ర(17) ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గతనెల 3వతేదీన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యం దగ్గరికి తీసుకెళ్లారు. అతను వేసిన సూదులు, మందులతో జ్వరం తగ్గకపోవడంతో మరుసటిరోజు తిరిగి అక్కడికే వెళ్లారు. మళ్లీ సూదులు వేసినా తగ్గకపోవడంతో మైదుకూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ అన్ని పరీక్షలు నిర్వహించారు. అప్పటికే పిల్లవాడికి చేయి, కాలు చచ్చుబడిపోయిందని, మందు మెదడుకు రియాక్షన్ ఇచ్చిందని తెలపడంతో ప్రొద్దుటూరుకి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత నెల 4వ తేదీన బాలుడు మృతి చెందాడన్నారు. బాలుడి అంత్యక్రియల లోపే తమ చిన్నబ్బాయికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చెన్తె్నకి తీసుకెళ్లి తిరిగి వచ్చామని, పెద్దబ్బాయి మృతిపై అనుమానాలు ఉండటంతో శవపరీక్ష చేయాలని కోరామన్నారు. దీంతో పూడ్చిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి కడప రిమ్స్ వైద్యుడు డాక్టర్ ఆనందకుమార్ శవ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్‌రెడ్డి, ఎస్ఐ రంగస్వామి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఆర్ఎంపీ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నార్సింగికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కొండయ్య(58) మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న కొండయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
తెర్నెకల్‌లో ప్రబలిన అతిసార
తెర్నెకల్(దేవనకొండ) : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం అతిసార వ్యాధి ప్రబలడంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన పెద్దయ్య, కంసలి లక్ష్మి, కళావతి, వెంకటేశ్వరమ్మ, వీరేష్, చాకలి బడేసాబ్‌తో పాటు మరో 44 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ స్థానిక ఆర్ఎంపీ వద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యసిబ్బంది గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి అతిసార వ్యాధిని నియంత్రించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. -
భారీగా శ్యాంపిల్ మందులు స్వాధీనం
–ఓ ఇంట్లో రూ.15లక్షల విలువ చేసే మందులు –రెక్కి నిర్వహించి పట్టుకున్న డ్రగ్స్ అధికారులు కర్నూలు(హాస్పిటల్): జిల్లా కేంద్రమైన కర్నూలులో భారీగా శ్యాంపిల్ మందులు లభించాయి. ఔషధ నియంత్రణ అధికారులు పకడ్బందీగా ఓ ఇంటిపై దాడి చేసి రూ.15లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. తమ వీధిలోని ఓ ఇంట్లో ఇలాంటి అక్రమ వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని కాలనీవాసులు విస్తుపోయారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన దామోదర్ గతంలో కడప జిల్లాలో మెడికల్ షాప్ నిర్వహించేవాడు. మందుల క్రయవిక్రయాల్లో లాభాలను బాగా తెలుసుకున్న అతను వైద్యులకు ఇచ్చే ఫిజీషియన్ శ్యాంపిల్స్‌పై కన్నేశాడు. వాటిని చెన్నై, కోయంబత్తూరు, మధురై ప్రాంతాలతో పాటు స్థానికంగా కొందరు మెడికల్ రెప్‌ల నుంచి ఫిజీషియన్ శ్యాంపిల్స్‌ను కొనుగోలు చేసేవాడు. వాటిని స్థానిక బళ్లారిచౌరస్తాలోని సంపత్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉంచి వ్యాపారం చేసేవాడు. వీటిని అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆర్ఎంపీలకు విక్రయించేవాడు. ఇతని వద్ద నుంచి కర్నూలు జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజ, అలంపురం, గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి ఆర్ఎంపీలు వచ్చి కొనుగోలు చేసి వెళ్లేవారు. పక్కా ప్రణాళికతో.. పదిరోజుల క్రితం స్థానిక కర్నూలు మెడికల్ కాలేజి ఎదురుగా ఉండే బాలాజి మెడికల్స్‌లో కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిల్ అలీషేక్ కొన్ని ఫిజీషియన్ శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన సమాచారాన్ని బట్టి అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకున్నారు. ఈ మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు మందులు కొనే ఆర్ఎంపీల అవతారం ఎత్తారు. శనివారం మధ్యాహ్నం దామోదర్‌కు ఫోన్ చేసి మందులు కావాలని కోరారు. దీంతో అతను నమ్మి సంపత్‌నగర్‌కు వచ్చి మందులు విక్రయించాడు. వెంటనే విషయం తెలిపి మందులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున 4 గంటల వరకు శ్యాంపిల్ మందుల పంచనామా చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 500 రకాల మాత్రలు, సిరప్లు, సోప్‌లు, పౌడర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. శ్యాంపిళ్లు అమ్మే వైద్యులపై నిఘా..! తమ వద్దకు చికిత్సకు వచ్చే రోగులకు మందుల కంపెనీలు ఇచ్చే ఫిజీషియన్ శ్యాంపిళ్లను వైద్యులు ఉచితంగా ఇవ్వాలి. కానీ కర్నూలు నగరంలో కొందరు వైద్యులు ఈ శ్యాంపిల్ మందులను సైతం రోగులకు అమ్ముకుంటున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలా శ్యాంపిళ్లు అమ్మే వైద్యులు, ఆర్ఎంపీలపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా రక్తాన్ని సేకరిస్తున్నారని, లైసెన్స్‌లు లేకుండా ఔషధ విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి విషయాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు7382934390 అనే నెంబర్‌కు ఫోన్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలీ షేక్ తెలిపారు. -
వివాహేతర సంబంధంతోనే భ్రూణహత్య
నెలన్నర క్రితం మాధవరం గ్రామంలో కలకలం సృష్టించిన మృత శిశువు కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధంతోనే భ్రూణహత్యకు పాల్పడి శిశువు మృతదేహాన్ని పాడుబడిన ఇంటిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన జంటతో పాటు ఆర్ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మాధవరం పోలీసు స్టేషన్లో సీఐ నాగేశ్వరరావు విలేకరులకు వివరించారు. - మంత్రాలయం రూరల్ తెలంగాణ రాష్ట్రం గద్వాల మండలం పాతకల్లు గ్రామానికి చెందిన జయమ్మ భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం మాధవరం గ్రామంలోని ఓ హోటల్లో ఏడాది క్రితం పని మనిషిగా చేరింది. అక్కడ పని చేస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయాచూర్కు చెందిన షేక్ మహబూబ్తో పరి చేయడం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఏడో నెలలో అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. ఽఆగస్టు 23వ తేదీన స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజును సంప్రదించారు. కొంత నగదు తీసుకుని మాత్రలు ఇచ్చారు. అయితే అప్పటికే నెలలు నిండంతో అబార్షన్ కష్టమైంది. 27వ తేదీ రాత్రి ఆర్ఎంపీకి దగ్గరికి వెళ్లారు. వైద్యుడు డబ్బుకు ఆశపడి జయమ్మ గర్భాన్ని తొలగించాడు. మృత ఆడ శిశువును గ్రామ చావిడి పక్క భాగంలో పాడుబడిన ఇంటిలో ఆర్ఎంపీ నాగరాజు పారవేశారు. మరుసటి రోజు శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జయమ్మ, మహబూబ్‌ను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నిందితులకు రిమాండ్ విచారణలో భాగంగా సోమవారం తహశీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు మాధవి, చంద్రశేఖర్‌లు పాప పుర్రె, చేతులు, కాళ్లకు సంబంధిచిన ఎముకలను సేకరించారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించిన తరువాత నివేదికను అందజేస్తామని సీఐ నాగేశ్వరరావుకు వివరించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, జయమ్మ, మహబూబ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరుచగా మెజిస్రే్టట్ రిమాండ్‌కు ఆదేశించారు. కేసును ఛేదించడంలో హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ శ్రీనులను సీఐ అభినందించారు. సమావేవంలో ఎస్ఐ రాజారెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారులు శ్వేత, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం
కేసు నమోదు, విచారణ క్లినిక్‌తోపాటు మెడికల్‌షాపు సీజ్ బేల : వాంతులు, విరోచనాలతో వచ్చిన ఓ బాలుడికి పరిమితికి మించి వైద్యం చేసిన ఆర్ఎంపీ లక్ష్మణ్‌పై శుక్రవారం కేసు నమోదైంది. ౖÐð ద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టి అతను నడుపుతున్న క్లినిక్‌తోపాటు మెడికల్ షాపును సీజ్ చేశారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణియాపూర్ గ్రామానికి షేక్ అయాన్ (8) వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆగస్టు 24న బేల మండల కేంద్రంలోని శివాజీచౌరస్తా సమీపంలో గల ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లగా ఆర్ఎంపీ లక్ష్మణ్ వైద్యం చేశారు. ఏమైందో ఏమో గాని అదే రోజు బాలుడి ఎడమచేయి, కాలుకు పక్షపాతం వచ్చింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని పిల్లల వైద్య నిపుణులు స్వామి వద్ద చూపించగా అతను హైదరాబాద్ రెఫర్ చేశారు. ఎస్కేఎస్ న్యూరో పాలిట్రామ ఆస్పత్రిలో పరీక్షలు వైద్యం వికటించి మెదడులో కుడివైపు రక్తనాళాలు చిట్లిపోయి పక్షపాతం వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తండ్రి జఫర్ ఈ నెల 21 స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులకు ఫిర్యాదు చేయగా వైద్య, ఆరోగ్యశాఖ ఆదిలాబాద్ క్లస్టర్ ఎస్పీహెచ్వో సాధన శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడు షేక్ అయాన్, తండ్రి జఫర్‌తోపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్ఎంపీ ఇచ్చిన వైద్యం, మరుసటి రోజు ఆదిలాబాద్‌లో పిల్లల వైద్య నిపుణులు స్వామి చెకప్, హైదరాబాద్‌లోని వైద్య చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లి, ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌తో మాట్లాడారు. బాలుడు అయాన్‌కు వాంతులతోపాటు విరేచనాలకు ఇచ్చిన వైద్యంపై ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడు నాటకం ఆడుతున్నాడని, బ్లాక్మెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని ఆర్ఎంపీ చెప్పడంతో బాధితుల తరఫు వారు ఆగ్రహంతో క్లినిక్ ఎదుట ఆందోళన చేశారు. వీరందరిని ఎస్సై నరేశ్‌కుమార్ సముదాయించారు. క్లినిక్ సీజ్.. ఆర్ఎంపీ చిట్టీపై ఇంజక్షన్లు, మాత్రలతో వైద్యం చేసినట్లు గుర్తించినట్లు ఎస్పీహెచ్వో సాధన తెలిపారు. ఆర్ఎంపీ ప్రాథమిక వైద్యం కాకుండా పరిమితికి మించి వైద్యం చేయడం, హైడోసులు వాడడం, క్లినిక్‌లో వైద్యం చేస్తున్న ఇతడి అర్హత పత్రాలు సరిగా లేకపోవడంతో క్లినిక్‌తోపాటు మెడికల్ షాపును సీజ్ చేసినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట సర్పంచ్ మస్కే తేజ్‌రావు, వైఎస్ ఎంపీపీ నిపుంగే సంజయ్, మండల కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి టాక్రే గంభీర్, మైనార్టీ యూత్ సభ్యులు ఉన్నారు. ఆర్ఎంపీపై కేసు నమోదు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు క్లినిక్ ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఎడమ చేయితోపాటు కాలు పక్షపాతానికి గురైన బాలుడు షేక్ అయాన్ తండ్రి జఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు పేర్కొన్నారు. -
ఆర్ఎంపీ దారుణ హత్య
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కె.బ్రాహ్మణపల్లిలో ఆర్ఎంపీ ఆనంద్ గురువారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. తన భర్త కనపడటం లేదని భార్య రోష్ని ఈ నెల 4న కదిరి రూరల్ పోలీస్టేçÙన్లో ఫిర్యాదు చేసింది. ఆమెపై ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆనంద్ కె.బ్రాహ్మణపల్లిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ బంధువులే దారుణంగా హత్య చేసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం కోసం రాత్రంతా వెతికినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ వెంకటప్రసాద్‌ను వివరణ కోరగా..ఆనంద్ మృతదేహం కోసం గాలించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అది అది దొరక్కపోవడంతో వెనుదిరిగి వచ్చామన్నారు. -
ఆర్ఎంపీలపై ఎందుకంత కక్ష ?
అనంతపురం సిటీ: ఎక్కడో తప్పు జరిగితే మెత్తం ఆర్ఎంపీలను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఆర్ఎంపీలు మండి పడ్డారు. మంగళవారం స్థానిక సాయినగర్‌లోని ఆర్ఎంపీల యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోఆర్ఎంపీల జిల్లా అధ్యక్షులు జి.ఎస్ ప్రసాద్, సుధాకర్‌లు మాట్లాడారు. తమ అవసరం గుర్తించి 429 జీవోని తీసుకువచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా రూ.2 కోట్లా 32 లక్షలతో వేలాది మంది ఆర్ఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ కోర్సుల కింద శిక్షణ ఇప్పించారన్నారు. ఎక్కడో ఒక ఆర్ఎంపీ తప్పు చేశాడని మెత్తం వ్యవస్థనే నిర్భందించాలని చూడటం సరికాదన్నారు. తాజాగా హిందూపురంలో ఒకరు ప్రభుత్వాస్పత్రిలో డెంగీతో మరణించారనీ, అలాగని ఆ ఆస్పత్రిని మూసేయించడం ఎంత వరకు న్యాయమో జిల్లా కలెక్టరే చెప్పాలన్నారు. ఆర్ఎంపీలపై జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం వారు నగరంలో ర్యాలీ చేశారు. -
కోసేస్తారు..తీసేస్తారు..!
ఎంబీబీఎస్ చదవక పోయినా వారు డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. పేరు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని అబార్షన్లు, హెర్నియా, గర్భసంచి తొలగింపు వంటి శస్త్రచికిత్సలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమవుతున్నారు. హైదరాబాద్‌లోనే ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో 1804 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉండగా వీటిలో కేవలం 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఐదు వేలకుపైగా క్లీనిక్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 1200 వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్‌లు నడుపుతూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న కొంత మంది ఆర్ఎంపీలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకున్న వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. హెర్నియా నుంచి అబార్షన్ల వరకు: బస్తీల్లోని నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు గైనకాలజిస్టులుగా, జనరల్ ఫిజిషయన్స్గా, జనరల్ సర్జన్స్‌గా చలామణి అవుతున్నారు. హెర్నియా, అపెండిసైటీస్, అబార్షన్లు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు చేస్తున్నారు. కొన్నిసార్లు అధిక రక్తస్త్రావం వల్ల రోగులు మృత్యువాతపడుతున్నారు. నగరంలోని చార్మినార్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, కంచన్‌బాగ్, బీఎన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, భూపేష్గుప్తానగర్, నందనవనం, మీర్పేట్, హస్తినాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్, బండ్లగూడ, బోడుప్పల్, రాజేంద్రనగర్, మల్కజ్గిరి, మాణికేశ్వరినగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందగా, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వారు స్వయంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు నడుపుతున్నారు. వీటికి ఎలా ంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని ఘటనలుః ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఓ నర్సింగ్‌హోంలో గర్భవతికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శిశువుకు జన్మనిచ్చి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ నర్సు గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు చెప్పుకుంటూ రోగులకు చికిత్స చేస్తుండగా కంచన్‌బాగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీరా సదరు మహిళ చదివింది బీఎస్సీనర్సింగ్ అని తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ యునాని వైద్యుడు నొప్పితో బాధపడుతున్న ఓ రోగికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందగా, శవాన్ని మూటలో కట్టి శంషాబాద్ సమీపంలో తగులబెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంచ లనం సృష్టించింది. లేఖ రాసినా..స్పందన లేదు: హైదరాబాద్ జిల్లా పరిధిలో 1804 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 1100-1200 క్లీనిక్స్ ఉన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటికి నోటీసులు జారీ చే శారు. అనుమతుల్లేని వాటికి మంచినీరు, డ్రైనేజీ, కరెంట్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సహా టీఎస్ఎస్పీడీసీఎల్కు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆర్ఎంపీలు నిర్వహించే క్లీనిక్స్ పై చర్యలు తీసుకునే అధికారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లేక పోవడంతో వారేమీ చేయలేక పోతున్నారు. 16 మంది నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అరెస్టు వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 16 మంది నకిలీ ఆర్ఎంపీలను సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్డ్ మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్ఎంపీలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తుండటం గమనార్హం. అరెస్టయిన వారి వివరాలు.. కె.రామలింగయ్య(శ్రీనివాస క్లీనిక్), కాళిదాస్(డాక్టర్ కాళీదాస్ పాలీ క్లీనిక్), కృష్ణమూర్తి( (విజయ పాలీక్లీనిక్)), మోహనాచారి( శ్రీసాయి క్లీనిక్), ఎస్.నరసింహులు(శ్రీ వెంకటసాయి క్లీనిక్),డి.శంకర్, ఎస్ఎం హుస్సేన్(అన్సారి క్లీనిక్), ఎం.పవన్‌కుమార్(శ్రీసాయి అక్షర క్లీనిక్), జనార్థనాచారి,డి.చెన్నారెడ్డి( వినిషా క్లీనిక్)లతో పాటు మేడిపల్లి, నాచారంలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా క్లినిక్ లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడి మృతి
ఇంజక్షన్ వికటించడం వల్లనేనని బంధువుల ఆరోపణ హాస్పిటల్ ఎదుట ఆందోళన మహబూబాబాద్ : ఇంజక్షన్ వికటించి 10 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం మానుకోట పట్టణంలోని సుబ్రహ్మణ్యం క్లినిక్‌లో చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యుడు ఆ బాలుడికి చేసిన చికిత్స మూలంగా ఫిట్స్‌తో మృతి చెందాడు. బాలుడి తల్లి కథనం ప్రకారం.. మానుకోట పట్టణ శివారులోని రామన్నపేట కాలనీకి చెందిన ఎస్కె.జరీనా, జానీ దంపతులకు ఇద్దరు కుమారులు. జరీనా తన పెద్ద కుమారుడు అస్రద్ (10), చిన్న కుమారుడు ఫరోజ్‌తో కలిసి బుధవారం తల్లిగారింటికి వచ్చింది. అస్రద్కు తీవ్ర జ్వరం ఉండటంతో పట్టణంలోని సుబ్రహ్మణ్యం క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు జ్ఞానేశ్వర్ ఆ బాలుడికి ఇంజక్షన్ ఇవ్వగా, ఆ తర్వాత కొద్ది సేపటికే చాతి, గుండె వద్ద నొప్పిగా ఉందని చెప్పాడు. తర్వాత మూత్ర విసర్జనకు బయటకు వచ్చాడు. అప్పటికే శరీరంపై దద్దుర్లు, ఆ తర్వాత ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే అస్రద్ మృతి చెందాడని బాలుడి బంధువులు, పలు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో టౌన్ ఎస్సై ప్రసాద్‌రావు, ట్రైయినీ ఎస్సై మురళీధరరాజు వచ్చి బందోబస్తు నిర్వహించారు. వైద్యుడిపై చర్య తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టౌన్ సీఐ నందిరామ్ నాయక్‌ను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదన్నారు. కొన్ని సంఘాల నాయకులు మాత్రం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారని చెప్పారు. -
కొత్తూరులో కిడ్నాప్ కలకలం
కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కిడ్నాప్ చేశారన్న వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ సదరు వైద్యుడిని ఎవరు తీసుకువెళ్లారన్న విషయంలో స్పష్ట త కొరవడింది. మంగళవారం వైద్యుడి కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్టు తెలియవచ్చింది. ఈ ఆర్ఎంపీ వైద్యుడు ఎవరు ? ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయమై కొత్తూరు పీఎస్సై జనార్దనరావు వద్ద ప్రస్తావించగా.. కిడ్నాప్ ఘటనపై తమ కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. హల్చల్ చేస్తున్న ఉదంతాలు... ఇటీవల సీతంపేట ఏజెన్సీ దొనుబాయి కేంద్రంగా పురాతన రాగి నాణేలు క్రయ, విక్రయాల జరిగిన విషయం బయట పడటంతో పోలీసులు నిఘా పెంచారని వదంతులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడితో పాటు సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నారని వందలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు సైతం పాలకొండ, సీతంపేట, వీరఘట్టాం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. -
ఆర్ఎంపీ డాక్టర్ దారుణ హత్య
కోస్గి: ఓ ఆర్ఎంపీ వైద్యుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూల్ జిల్లా కోస్గిలో జరిగింది. పెద్దకడపూర మండలంలోని గదిగట్టు గ్రామానికి చెందిన కావలి వీరన్న ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన కాళ్లు చేతులు కట్టేసి కోస్గిలో రైలు పట్టాలపై పడేశారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య
కరీంనగర్: ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కతలాపూర్ మండలం గంభీర్పూర్లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనుంజయ్(33) ఆర్.ఎం.పీ డాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం
► అస్వస్థతకు గురైన కాంబ్లె దేవుబాయి ► ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి తరలింపు వారు అమాయక గిరిజనులు.. డాక్టర్లలో ఎంబీబీఎస్‌లు, ఎండీలు, ఆర్ఎంపీలు, పీఎంపీలు ఉంటారని కూడా తెలియని అమాయకత్వం వాళ్లది. వా రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బు పోగుచేసుకుంటున్నారు. వచ్చీరాని వైద్యంతో గిరిజన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏడాదో ఆర్నెల్లో ప్రయివేటు ఆస్పత్రిలో పని చేసి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నారు. కనీస అర్హతలు లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నార్నూర్ : మండల కేంద్రంలోని హరిఓం క్లినిక్‌లో ఆర్ఎంపీ వైద్యుడు గురువారం కొలామా గ్రామానికి చెందిన కాంబ్లె దేవుబాయికి వైద్యం అందించారు. వైద్యం వికటించడంతో ఆమె ఆస్వస్థతకు గురైంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం వికటించడంతోనే ఆమె ఆస్వస్థతకు గురైందని ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు బలిరాం, కాంబ్లె సుభాస్, భగవాన్లు తెలిపిన వివరాల ప్రకారం దేవుబాయికి జ్వరంతో పాటు కాళ్లు, చేతులకు నొప్పులు రావడంతో ఆర్ఎంపీ దగ్గరకి తీసుకెళ్లామని తెలిపారు. గ్లోకోజ్ బాటిల్ ఎక్కించి, మూడు ఇంజక్షన్లు ఇచ్చి రెండు మాత్రలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని టెస్టుల పేరిట దండుకుంటున్నారని తెలుస్తోంది. మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అడే ఆశ్వర్య అనే బాలికను ఈ వైద్యుడే వైద్య పరీక్షలు నిర్వహించారు. మలేరియా నేగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ బాలికను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించగా వైద్యుడు శ్రీనివాస్ మూడు సార్లు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియా నేగిటివ్గా నిర్ధారించారు. మలేరియా ఉదంటూ ఆర్ఎంపీ వైద్యుడు రూ. 200 తీసుకున్నారని బాలిక తల్లి అడే సంగీత తెలిపారు. కనీస అవగాహన లేని వైద్యులు వైద్యం పేరిట గిరిజన, దళితులను ఎలా మోసం చేస్తున్నారో తెలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయమై ఆఎంపీ వైద్యుడు సర్కార్‌ను వివరణ కోరగా యాపిల్ ఇంజక్షన్ ఇచ్చి రెండు పారాసిటమాల్ మాత్రలు మాత్రమే ఇచ్చానని తెలిపారు. దేవుబాయి పరిస్థితి బాగానే ఉందని, వైద్యం అందించడంలో ఏ పొరపాటు జరగలేదని ఆర్ఎంపీ వివరణ ఇచ్చారు. -
ఆ చివరి లైఫ్‌బోట్..
టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు.. నేనున్నానంటూ పలువురి ప్రాణాలకు భరోసా కల్పిస్తూ.. నౌకలోని చివరి లైఫ్‌బోట్ తన ప్రయాణాన్ని సాగించింది.. మరేమైంది.. మాట నిలబెట్టుకుందా? టైటానిక్‌లాగే మునిగిపోయిందా? మే 13, 1912.. టైటానిక్ విషాదం జరిగి దాదాపు నెల రోజులు.. ప్రమాద స్థలానికి సరిగ్గా 200 మైళ్ల దూరం.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆర్ఎంఎస్ ఓషియానిక్ నౌక నెమ్మదిగా ప్రయాణం సాగిస్తోంది.. అల్లంత దూరంలో సముద్రంలో సగం మునిగి తేలుతున్నట్లు పడవలాంటిది కనిపించింది.. అదేంటో పరిశోధించడానికి ఓషియానిక్ నుంచి కొందరు బయల్దేరారు.. అప్పుడు కనిపించింది వీరికా చివరి లైఫ్‌బోట్.. తనతోపాటు ముగ్గురు అభాగ్యుల మృతదేహాల్ని మోస్తూ.. ఇంతకీ ఈ మధ్యలో ఏం జరిగింది? టైటానిక్ నుంచి పదుల సంఖ్యలో ప్రయాణికులను మోసుకుని బయల్దేరిన ఈ చివరి లైఫ్ బోట్‌కు కూడా టైటానిక్‌కు పట్టిన గతే పట్టిందని తేలింది. బయల్దేరిన కొద్దిసేపటికే.. టైటానిక్‌లాగే ఇది కూడా ఓ మంచు కొండను ఢీకొంది. పలువురు సముద్రంలో మునిగిపోయారు. షిప్‌నకు చెందిన ఇద్దరు ఫైర్మన్లు, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు థాంప్సన్ మృతదేహాలను మాత్రం మోస్తూ.. ఇదలాగే ఉండిపోయింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు ఓషియానిక్ సిబ్బందికి బోటు అడుగుభాగంలో కనిపించాయి. ఈ చివరి లైఫ్‌బోట్ కు సంబంధించిన అరుదైన చిత్రాలు, మొత్తం ఆపరేషన్‌ను వివరిస్తూ రాసిన పత్రం తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీన్ని ఈ శనివారం బ్రిటన్‌లోని విల్ట్‌షైర్‌లో వేలం వేయనున్నారు. భారీగా ధర పలుకుతుందని అంచనా. -
ఆర్ఎంపీ నాలుగో భార్య అనుమానాస్పద మృతి
ముగ్గురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోయిన ఓ ఆర్ఎంపీ డాక్టర్.. నాలుగోపెళ్లి చేసుకోగా, ఆ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కంచికచర్లలో శుక్రవారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గత పదేళ్లుగా కంచికచర్లలో ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన సుందరమ్మను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. సుందరమ్మ మృతికి శ్రీనివాస్ రెడ్డి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. మొదట్లో అతడు మధిరకు చెందిన విజయలక్ష్మీని పెళ్లాడాడు. పెళ్లయిన మూడు నెలల తరువాత.. ఆమె తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. దీంతో కొన్ని రోజుల తరువాత కంచికచర్లకి వచ్చి స్థిరపడ్డాడు. ఆ తర్వాత వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన శ్రీనివాస్‌రెడ్డి ఆమెతో తెగతెంపులు చేసుకొని అదే గ్రామానికి చెందిన రాధను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండేళ్ల క్రితం ఇల్లు వదిలి పారిపోయింది. దీంతో గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సుందరమ్మను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె శుక్రవారం రోజు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వైపు సుందరమ్మ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని శ్రీనివాస్‌రెడ్డే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. తామ కూతురు చాలా ఆరోగ్యంగా ఉండేదని, ఆమెకు గుండెపోటు వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఎంపీ డాక్టర్ దారుణ హత్య
మద్దిపాడు: ప్రకాశం జిల్లాలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఈమని రాంబాబు (35) గ్రామంలో వైద్యం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయన ఎంతకీ లేవగాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తలపై గొడ్డలితో నరకడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధాలే రాంబాబు హత్యకు దారితీసినట్టు స్థానికులు చెప్పుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
ఆర్ఎంపీ ఆత్మహత్య!
ఆర్ఎంపీ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్టుకూరు గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆర్ఎంపీ డాక్టర్ నారాయణస్వామి(29) వద్దకు వెళ్లగా.. తలుపులు మూసి ఉండటంతో.. బద్దలు కొట్టి చూడటంతో.. ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
వైద్యం వికటించి బాలిక మృతి
వైద్యం వికటించి బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రసికంటి శైని(8) అనే బాలిక గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లి దండ్రులు చికిత్స నిమిత్త సిరిసిల్లలోని ప్రైవేట్ వైద్యుడు వీరేందర్ ఆర్.ఎమ్.పీ. వద్దకు తీసుకొచ్చారు. అతను పాపను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే బాలిక మృతిచెందడంతో.. బాలిక తల్లిదండ్రులు బంధువులు వైద్యం వికటించడం వల్లే బాలిక మృతిచెందిందని.. ఆందోళనకు దిగారు. -
అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేస్తూ దొరికిపోయాడు
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అర్ధరాత్రి సమయంలో రహస్యంగా మృతదేహాన్ని దహనం చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం రామాలయం వద్ద సబ్‌రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి నిప్పంటించాడు. చెత్త తగులబడుతుందని స్థానికులు అనుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడని, వైద్యం వికటించి మృతి చెందిన రోగి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన బైక్ పై ఎక్కించుకుని శంషాబాద్‌లో దహనం చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డెంగ్యూతో వైద్యుడు మృతి
వైద్య సేవలు అందించే ఓ డాక్టర్ డెంగ్యూతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్మెయినుద్దీన్ (27) స్థానికంగా ఆర్ఎంపీ వైద్యసేవలు అందిస్తున్నాడు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా.. భార్య ఎనిమిది నెలల గర్భవతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
అంబులెన్స్ ఢీకొని వైద్యుడి మృతి
చిత్తూరు : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని బలి కోరుతుందో చెప్పలేం. వైద్యం చేసే డాక్టర్‌ను అంబులెన్స్ ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని సంతపేటలో ఆర్ఎంపీ వైద్యుడిగా క్లినిక్ నడుపుతున్న శశిధర్(35) మంగళవారం సాయంత్రం పనులు చూసుకుని తన స్వగ్రామం పైమాఘానికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇతన్ని ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శశిధర్‌ను 108 లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా హాలియాలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి చెందాడు. హాలియా మండలం కొత్తపల్లెకు చెందిన లక్ష్మయ్య (60) కాలిలో మేకు గుచ్చుకుని.... గాయం తీవ్రమైంది. దీంతో వైద్యం కోసం అతడు 15 రోజుల క్రితం హాలియాలోని ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ వద్దకు వెళ్లాడు. నయం చేస్తానని చెప్పి రూ 25 వేలు తీసుకుని.. లక్ష్మయ్యను ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు లక్ష్మయ్యకు సూర్యనారాయణ ఇంజక్షన్ ఇచ్చాడు. 11.00 గంటలకే లక్ష్మయ్య మృతి చెందాడు. సూర్యనారాయణ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే లక్ష్మయ్య మృతి అతడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ పరారయ్యాడు. బంధువుల ఆందోళన శనివారం కూడా కొనసాగుతుంది. అయితే పట్టణానికి చెందిన పెద్దమనుషుల ద్వారా లక్ష్మయ్య బంధువులతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకు స్థానికంగా పెద్ద మనుషులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
సెప్టెంబర్ 1 నుంచి ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ
హైదరాబాద్ : గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందని వైద్యసంఘాల సభ్యులు చెప్పారు. శిక్షణకు విధి విధానాలను ఖరారు చేయడానికి సోమవారం సచివాలయంలో కమ్యూనిటీ పారా మెడికల్ కార్యదర్శి కుమార్ అధ్యక్షతన, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో శిక్షణ ఇచ్చిన వైద్యులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఇప్పటివరకు కమ్యూనిటీ పారా మెడికల్ బోర్డులో నమోదు చేసుకున్న 24 వేల మందికి శిక్షణ ఇవ్వాలని కోరామని వైద్య సంఘాల సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. ఇందుకు అవసరమ్యే నిధులను మంజూరు చేసినందుకు ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వి.రావు, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, పట్టణ, గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షుడు బాలబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం వికటించి బాలిక మృతి
చింతకాని : వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో చోటుచేసుకుంది. చింతకాని మండలంలోని చిన్నమండవ గ్రామానికి చెందిన ఏసు తన కుమార్తె మనీషా(6) జ్వరంతో బాధ పడుతుండటంతో శనివారం మధ్యాహ్నం నాగులవంచలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన బాలికను పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ అది వికటించటంతో అరగంటలోనే బాలిక చనిపోయింది. దీంతో బాధితులు గ్రామంలో ఆందోళనకు దిగారు. -
ఆర్ఎంపీ దారుణ హత్య
సాగర్‌కాల్వ వద్ద మృతదేహం లభ్యం ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన సూడి రాజశేఖరరెడ్డి(21) అదే మండలానికి చెందిన స్వాతితో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తొమ్మిది నెలలుగా కూసుమంచి మండలం గట్టుసింగారంలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే గ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం అఖిల్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు రాజశేఖర్ వద్దకు వచ్చి తాము వరి కోత మిషన్‌పై పనిచేస్తున్నామని, జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేయించుకుని వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే ముగ్గురు రాజశేఖర్ వద్దకు వచ్చి వరి కోతల పని పూర్తికావడంతో తాము తిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. వీడ్కోలు సందర్భంగా పార్టీ చేసుకుందామని అన్నారు. ఈ ప్రతిపాదనను రాజశేఖర్ నిరాకరించాడు. తనకు పని ఉందని, పార్టీ చేసుకునేందుకు రాలేనని చెప్పాడు. దీంతో వెళ్లిపోయిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని, ఖమ్మంలో తెలిసిన ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు రావాలని రాజశేఖర్‌కు చెప్పాడు. దీంతో రాజశేఖర్ బయల్దేరి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య ఫోన్ చేసి అడగగా తాను ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. తాను తీసుకెళ్లిన పేషేంట్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కొద్ది సేపట్లోనే బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తానని అన్నాడు. అయితే రాత్రి తొమ్మిది దాటినా రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో స్వాతి కంగారుపడిపోయింది. మృతదేహాన్ని గుర్తించారిలా.. సాగర్‌కాల్వ పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉందంటూ కొందరు ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పక్కన బీరుసీసాలతోపాటు తినుబండారాలు ఉన్నాయి. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. కాల్వ క ట్ట పక్కన ఓ యువకుడి మృతదేహం ఉందని, మృతుడు గడ్డంతో ఉండి టీషర్టు ధరించి ఉన్నాడని గట్టుసింగారం గ్రామస్తులకు తెలిసింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన స్వాతి ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంది. మృతదేహం తన భర్త రాజశేఖర్‌దేనని గుర్తుపట్టి భోరున విలపించింది. ఈ మేరకు సీఐ తిరుపతిరెడ్డి కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నకిలీ విలేకరులు రిమాండ్
హైదరాబాద్ : విలేకరులమని వచ్చి ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను బ్లాక్మెయిల్ చేసి రూ.25 వేలు తీసుకున్న నలుగురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అమలాపురానికి చెందిన సిలివేరు సత్యరావుప్రసాద్ మెదక్ జిల్లా బీరంగూడ రాజేంద్రకాలనీలో నివాసముంటున్నారు. పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెంకు చెందిన నేదూరి స్వామి కూకట్‌పల్లిలోని మధురానగర్‌కాలనీ, తూర్పుగోదావరి మామిడికుదురుకు చెందిన బోర్సు సాయి వెంకటదుర్గారావు వనస్థలిపురం శారదానగర్‌లో నివసిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కొరవేలు ఉజ్వల లు కలిసి నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. కుత్బుల్లాపూర్‌లో ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న సంధ్యను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 17న తమ గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్ చేయాలని సంధ్య వద్ద కు వచ్చారు. ఆమె అబార్షన్ చేసేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన సంభాషణలను వారు రికార్డు చేశారు. అనంతరం డాక్టర్ సంధ్యకు ఫోన్‌చేసి మేము న్యూస్ ఇండియా ఛానల్లో పనిచేస్తున్న విలేకరులమని చెప్పి అక్రమంగా అబార్షన్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తామని బెదిరించారు. తమకు డబ్బులు ఇస్తే గుట్టు బయటపడకుండా చేస్తామని ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. దీంతో బెదిరిపోయిన సంధ్య వారికి రూ.25 వేలు ఇచ్చింది. అనంతరం వారిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేసింది. సంధ్య ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యరావు ప్రసాద్, నేదూరి స్వామి, సాయివెంకట దు ర్గారావు, ఉజ్వలలు టీవీ ఛానల్లో పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
ఆర్ఎంపీ వైద్యుడి దుర్మరణం
తణుకు క్రైం :తణుకు మండలం దువ్వ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గాంధీ నగరంలో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యు కుచ్చెర్లపాటి సత్యనారాయణరాజు (48) తాడేపల్లిగూడెంలోని స్నేహితుల ఇంటి గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు భార్య నాగమణితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. దువ్వ వద్ద వెంకయ్యకాలువ ప్రాంతంలోకి వచ్చేసరికి దువ్వ సొసైటీ ఉపాధ్యక్షులు కోలపల్లి గోపాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన ధనరాజులు పొలం నుంచి బైక్‌పై దువ్వ గ్రామానికి వ్యతిరేక దిశలో వస్తుండగా రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టుకున్నాయి. ఆర్ఎంపీ వైద్యుడు సత్యనారాయణరాజు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో గాయపడినృ గోపాలకృష్ణ, ధనరాజులను హైవే పెట్రోలిృగ్ వాహన సిబ్బంది ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. రూరల్ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సత్యనారాయణరాజుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరూ వివాహాలై హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకుని వారు తణుకు బయలుదేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ‘ఎంతోమంది ప్రాణాలు నిలిపారు’ ‘ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన మీకు ఈ రోజు ఈ దుస్థితా’ అంటూ సత్యనారాయణరాజు భౌతికకాయం వద్ద భార్య నాగమణి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆ వేళ ఈ వేళ అని లేకుండా పెద్ద పెద్ద వైద్యులకు దీటుగా వైద్యసేవలందించారంటూ విలపించారు. సత్యనారాయణరాజు మందిస్తే రోగం నయమైపోద్దనే అందరికీ నమ్మకమే.. అటువంటి నీకు మందిచ్చి.. నీ ప్రాణాలు నిలిపే వైద్యుడే లేకపోయాడా అంటూ గుండెలవిసేలా భార్య, కుటుంబసభ్యులు విలపించారు. గాంధీనగర్‌లో విషాదం అమలాపురం రూరల్ : పీఎంపీ, ఆర్ఎంపీల అసోసియేషన్ కోనసీమ కార్యదర్శి కేఎస్ఎన్.రాజు (55) ఆదివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా దుళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భార్య నాగమణితో కలిసి ఓ శుభకార్యానికి హాజరయ్యేం దుకు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. రాజు స్వగ్రామమైన అమలాపురం గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. శుభ కార్యక్రమానికి వెళ్లివస్తామని చెప్పిన రాజు మృత్యువాతపడడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. మరణవార్త తెలిసిన వెంటనే పీఎంపీల అసోసియేషన్ కోనసీమ అధ్యక్షుడు కంబాల బాబూరావు, మం డల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి రామ్మోహనరావు, కార్యదర్శి రెడ్డి వెంకటేశ్వరరావు, ప్రతినిధులు వీవీరావు, రఫీ, గుత్తుల శ్రీనివాసరావు, కర్రి శేషగిరితోపాటు పలువురు నాయకులు సంఘటన స్థలానికి వెళ్లారు. రాజు మృతికి పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. -
దొంగగా మారిన ఆర్ఎంపీ
- అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు - రూ.9 లక్షల సొత్తు స్వాధీనం - పరారీలో మరో నిందితుడు వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా మారాడు. అన్న, తమ్ముడి వలే చోరీల బాట పట్టిన వైద్యుడిని పోలీసులు కటకటాల్లోకి పంపి రూ.9లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామానికి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ ఉరఫ్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. సుమారు 18 దొంగతనాలు చేయగా ఇందులో 8 తాళం వేసిన ఇళ్లలో.. మరో 10 చోరీలు మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌లు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. రాజ్‌కుమార్ చోరీ సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగారం, వంద గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సారయ్య పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్, మట్టెవాడ సీఐలు ఎస్ఎం.ఆలీ, ఆదినారాయణ, ఎస్సై లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుళ్లు వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్, జంపయ్య, రమాకాంత్, మట్టెవాడ కానిస్టేబుళ్లు రమేశ్, బాలకృష్ణను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. -
స్టెతస్కోప్ వదిలేసి చోరీల బాట
దొంగగా అవతారమెత్తిన ఆర్ఎంపీ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రూ.9 లక్షల సొత్తు స్వాధీనం పరారీలో మరో నిందితుడు వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. అప్పటికే ఇళ్లకు కన్నాలేసే విద్యలో ఆరితేరిన తన అన్నతమ్ముడిలాగే తాను చోరీల బాటపట్టాడు. చివరికి వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామాని కి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ అలియాస్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. అనంతరం అతడు తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. వీరు తాళం వేసిన ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ డమేగాక.. పది మంది మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సహకార నగర్, ఎక్సైజ్‌కాలనీ, మిల్స్‌కాలనీ పరిధిలోని శివనగర్ , మామునూరు పరిధిలోని గణేష్‌నగర్, కాజీపేటలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుబేదారి పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విజయ్పాల్కాలనీ, రాంనగర్, అశోకకాలనీ, మట్టెవాడ పరిధిలోని మర్రి వెంకటయ్య కాలనీ, బ్యాంకు కాలనీ, ఇంతెజార్గంజ్ పరిధిలోని గిర్మాజీపేట, కాజీపేట రైల్వేక్వార్టర్స్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. రాజ్‌కుమార్ తాను చోరీ చేసిన సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగా రం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన రాజ్‌కుమార్ తమ్ముడు సారయ్య పరారీలో ఉన్నాడు. -
కలకలం
పుట్టపర్తి అర్బన్ : భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, రైలు కింద పడి తనూ ఆత్మహత్య చేసుకున్న ఆర్ఎంపీ వైద్యుడి ఘటన బుధవారం పుట్టపర్తిలో కలకలం రేపింది. పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలోని ధర్మశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి అర్బన్ సీఐ వేణుగోపాల్, బంధువులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. నల్లమాడ మండలం కొత్తపల్లి తండా వాసి, ఆర్ఎంపీ వైద్యుడు మురళీధర్ నాయక్(30)తో, కదిరి సమీపంలోని పట్నం రాచువారిపల్లికి చెందిన నీలాబాయి(28)కి 2007లో వివాహమైంది. అనంతరం ప్రశాంతి గ్రామంలో కాపురం పెట్టారు. వీరికి కుమారుడు మోక్షిత్(5) కుమార్తె లాస్య(2) ఉన్నారు. ధర్మశాల దగ్గర్లోని బీడుపల్లి గ్రామంలో క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఐదు నెలల క్రితం ధర్మశాల వద్దకు మకాం మార్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం యథావిధిగా క్లీనిక్‌కు వెళ్లాడు. కుమారుడు మోక్షిత్ ఇంటి సమీపంలోని ఇంగ్లిష్ మీడియం స్కూలుకు వెళ్లాడు. 11 గంటలకు ఇంటికి వచ్చిన మురళీధర్ నాయక్, వచ్చీ రాగానే భార్యను పిడిబాకుతో మెడ, చేతులు, పొట్టలో, పలుచోట్ల కసిదీరా పొడిచాడు. ఆమె అరుపులు బయటికి వినిపించకుండా టీవీ వాల్యూమ్ బాగా పెంచాడు. ఇంట్లో ఆడుకుంటున్న కూతురు లాస్యనూ చంపేందుకు కడుపులో పొడిచాడు. భర్త బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంట్లోని మూడు గదులూ రక్తసిక్తమయ్యాయి. కూతురు కూడా చని పోయిందని భావించి వదిలేశాడు. అనంతరం తనూ బెడ్ రూంలోని ఫ్యాన్ కొక్కేనికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కానీ మనసు మార్చుకుని రక్తపు మరకలున్న దుస్తుల్ని విప్పేసి వేరే దుస్తులు ధరించి, టీవీ కట్టేసి, ఏమీ ఎరుగనట్లు ఇంటికి తాళం వేసి క్లీనిక్‌కు వెళ్లాడు. అక్కడ తలుపులు తెరవకుండా కొద్దిసేపు అటూఇటూ తిరిగి.. ద్విచక్ర వాహనంలో ప్రశాంతి రైల్వే స్టేషన్(పుట్టపర్తి రైల్వే స్టేషన్)కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం వేరయ్యాయి. కాగా హత్యానంతరం ఇంట్లోనే వదిలి వెళ్లిన పిడిబాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్లే క్రమంలో తోటి మహిళలు నీలాబాయి రాకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లోంచి పాప ఏడుపు వినిపించడంతో తలుపు వద్దకు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. అనుమానంతో వారు ఇంటి వెనుక వైపున ఉన్న కిటీకి అద్దం పగులగొట్టి లోపలకు తొంగి చూశారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న నీలాబాయిని చూసి నిశ్చేష్టులయ్యారు. వీరి సమాచారంతో పుట్టపర్తి అర్బన్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగుల గొట్టారు. పొట్టలోంచి పేగులు బయటపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి లాస్యను 108 వాహనంలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనంతపురంలోని చిన్నారి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ హరిప్రసాద్ చిన్నారికి చికిత్స చేశారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు, బంధువులు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆర్ఎంఎస్ పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్న అఖిల భారత ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభల పోస్టర్లు, లోగోను గురువారం ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే స్వగృహంలో యూనియన్ నాయకులు ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగభూషణం మాట్లాడుతూ యూనియన్ స్థాపించి 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి హాజరవుతారని పేర్కొన్నారు. అఖిల భారత ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శ్రీధర్‌బాబు, కన్నయ్య, ఆర్ముగం, చంద్రశేఖర్, కొండయ్య, మోహన్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో ఆర్ఎంపీల భాగస్వామ్యం అవసరం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించడంలో ఆర్ఎంపీల సేవలు ఎంతో కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగర శివారులోని గోపాలపురం వద్దనున్న ఎస్ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం జిల్లా ఆర్ఎంపీల సంఘం 13వ మహాసభను ఆయన వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలకు సకాలంలో వైద్యమందించేం దుకు ఆర్ఎంపీల సేవలను వినియోగించుకునేందుకు వైఎస్ఆర్ ప్రభత్వం నిర్ణయించిందన్నారు. ఇందు లో భాగంగానే వారికి ప్రభుత్వరంగ సంస్థయిన పారా మెడికల్ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు ఈ కార్యక్రమాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎంపీలకు ప్రత్యేక గుర్తింపునిస్తే రోడ్డు సౌకర్యాల్లేని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర వైద్యం అందుతుందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే ఆర్ఎంపీలకు తగిన ప్రాధాన్యమిస్తుందని అన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మహాసభలో పార్టీ సేవాదళ్ నాయకుడు దారెల్లి అశోక్, జిల్లా బీసీ సెల్ కన్వీనర్ తోట రామారావు, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్య గౌడ్, మందడపు వెంకటేశ్వరరావు, డాక్టర్ సామాన్య, వాలూరి సత్యనారాయణ, జాకబ్ ప్రతాప్, మైపా కృష్ణ, జిల్లేపల్లి సైదులు, ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాచారి, కోశాదికారి నాగభూషణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, న్యూరాలజిస్ట్ డాక్టర్ కె.గురునాధరావు, డాక్టర్ మురళి, డాక్టర్ నారాయణ, దంత వైద్యుడు పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


