ఆర్‌ఎంపీ దారుణ హత్య | rmp murdered in bramhanapalli | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ దారుణ హత్య

Sep 22 2016 11:13 PM | Updated on Aug 30 2018 6:04 PM

కదిరి రూరల్‌ మండలం కె.బ్రాహ్మణపల్లిలో ఆర్‌ఎంపీ ఆనంద్‌ గురువారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.

కదిరి అర్బన్‌ : కదిరి రూరల్‌ మండలం కె.బ్రాహ్మణపల్లిలో ఆర్‌ఎంపీ ఆనంద్‌ గురువారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. తన భర్త కనపడటం లేదని భార్య రోష్ని ఈ నెల 4న కదిరి రూరల్‌ పోలీస్టేçÙన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెపై ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆనంద్‌ కె.బ్రాహ్మణపల్లిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో మహిళ బంధువులే దారుణంగా హత్య చేసి వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలో మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే  పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం కోసం  రాత్రంతా వెతికినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ను వివరణ కోరగా..ఆనంద్‌ మృతదేహం కోసం గాలించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అది అది దొరక్కపోవడంతో వెనుదిరిగి వచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement