వైద్యంతో పాటు సామాజికసేవలూ అందించండి | rmps meeting in ramachandrapuram | Sakshi
Sakshi News home page

వైద్యంతో పాటు సామాజికసేవలూ అందించండి

Jan 22 2017 10:17 PM | Updated on Aug 30 2018 6:04 PM

గ్రామీణ వైద్యులు సమాజంలో విడదీయలేని భాగంగా అల్లుకుపోయారని ఆర్‌ఎంపీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. వారు వైద్యంతో పాటు సమాజ సేవలోనూ ముందుండాలని సూచించారు. జిల్లా గ్రామీణ వైద్యుల సమావేశం

రామచంద్రపురం:
గ్రామీణ వైద్యులు సమాజంలో విడదీయలేని భాగంగా అల్లుకుపోయారని ఆర్‌ఎంపీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. వారు వైద్యంతో పాటు సమాజ సేవలోనూ ముందుండాలని సూచించారు. జిల్లా గ్రామీణ వైద్యుల సమావేశం శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఆదివారం  నాయకులు నిడమర్తి సత్తిరాజు, కేఎస్‌ ఆచార్యులు  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 29న జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమానికి గ్రామీణ వైద్యులు తమవంతు సహకరించాలన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి సభ్యులంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. మరో ముఖ్య అతిథిగా ప్రముఖ ఈఎ¯ŒSటీ నిపుణుడు డాక్టర్‌ ఏవీ క్రాంతికిరణ్‌  చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ చర్యలు, చికిత్సా విధానాలను వివరించారు. ఆర్‌ఎంపీ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శోభ¯ŒSబాబు, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు వై. శ్రీనివాస్,  కేటీవీ ప్రసాద్, ఈశ్వర్, ప్రసాద్, ఎ.శ్రీనివాస్, వాసంశెట్టి నాగేశ్వరరావు, చలపతి, కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, ఎ¯ŒSవీ కృష్ణారావు, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement