ఆర్‌ఎంపీ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్టుకూరు గ్రామంలో గురువారం వెలుగుచూసింది.
ఆర్‌ఎంపీ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్టుకూరు గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆర్‌ఎంపీ డాక్టర్ నారాయణస్వామి(29) వద్దకు వెళ్లగా.. తలుపులు మూసి ఉండటంతో.. బద్దలు కొట్టి చూడటంతో.. ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


