ప్రియుడితో కలిసి భర్త హత్య | Rmp Doctor Murdered Teacher With Hes Wife In Chittoor | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్త హత్య

May 14 2018 9:06 AM | Updated on Aug 30 2018 6:04 PM

Rmp Doctor Murdered Teacher With Hes Wife In Chittoor - Sakshi

నిందితులతో డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ

చిత్తూరు, బంగారుపాళెం: ఉపాధ్యాయుని హత్య కేసులో నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించా రు. చెర్లోపల్లెకు చెందిన టీచర్‌ వాసుదేవన్‌ భార్య రమాదేవికి అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ రమేష్‌తో వివాహేతర సం బంధం ఉంది. ఈ విషయం తెలిసిన వాసుదేవన్‌ భార్యను, రమేష్‌ను మందలించాడు. వారిలో మార్పు రాలేదు. వాసుదేవన్‌ ఈ విషయాన్ని రమేష్‌ భార్య ఉషారాణి దృషికి తీసుకువెళ్లాడు.

ఆమె మూడు నెలలుగా భర్త రమేష్‌ను రమాదేవితో కలవనీయకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భర్త వాసుదేవన్‌ అడ్డు తొలగించుకోవాలని రమాదేవి ప్రియుడితో కలిసి పథకం పన్నింది. శనివారం వాసుదేవన్‌ భార్యాపిల్లలతో కలిసి బంగారుపాళెం మండలం బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం బైక్‌లో చెర్లోపల్లెకు వెళ్లివస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని రమాదేవి ప్రియుడి కి చెప్పింది. రమేష్‌ నూనెగుండ్లపల్లె సమీపంలో సుమోతో ఢీకొట్టి వాసుదేవన్‌(40)ను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకు నిదర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పారిపోయేందుకు కేజీ సత్రం బస్టాండ్‌ వద్ద ఉండగా రమేష్, రమాదేవిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement