నకిలీ విలేకరులు రిమాండ్ | Fake reporters remand | Sakshi
Sakshi News home page

నకిలీ విలేకరులు రిమాండ్

Dec 8 2014 11:21 PM | Updated on Aug 30 2018 6:04 PM

విలేకరులమని వచ్చి ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ను బ్లాక్‌మెయిల్ చేసి రూ.25 వేలు తీసుకున్న నలుగురు నకిలీ విలేకరుల..

హైదరాబాద్ : విలేకరులమని వచ్చి ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ ను బ్లాక్‌మెయిల్ చేసి రూ.25 వేలు తీసుకున్న నలుగురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అమలాపురానికి  చెందిన సిలివేరు సత్యరావుప్రసాద్ మెదక్ జిల్లా బీరంగూడ రాజేంద్రకాలనీలో నివాసముంటున్నారు. పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెంకు చెందిన నేదూరి స్వామి కూకట్‌పల్లిలోని మధురానగర్‌కాలనీ, తూర్పుగోదావరి మామిడికుదురుకు చెందిన బోర్సు సాయి వెంకటదుర్గారావు వనస్థలిపురం శారదానగర్‌లో నివసిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కొరవేలు ఉజ్వల లు కలిసి నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు.

కుత్బుల్లాపూర్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న సంధ్యను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 17న తమ గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్ చేయాలని సంధ్య వద్ద కు వచ్చారు. ఆమె అబార్షన్ చేసేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన సంభాషణలను వారు రికార్డు చేశారు. అనంతరం డాక్టర్ సంధ్యకు ఫోన్‌చేసి మేము న్యూస్ ఇండియా ఛానల్‌లో పనిచేస్తున్న విలేకరులమని చెప్పి అక్రమంగా అబార్షన్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తామని బెదిరించారు.

తమకు డబ్బులు ఇస్తే గుట్టు బయటపడకుండా చేస్తామని ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో బెదిరిపోయిన సంధ్య వారికి రూ.25 వేలు ఇచ్చింది. అనంతరం వారిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేష న్‌లో ఫిర్యాదు చేసింది. సంధ్య ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యరావు ప్రసాద్, నేదూరి స్వామి, సాయివెంకట దు ర్గారావు, ఉజ్వలలు టీవీ ఛానల్‌లో పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement