ప్రకాశం జిల్లాలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.
మద్దిపాడు: ప్రకాశం జిల్లాలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఈమని రాంబాబు (35) గ్రామంలో వైద్యం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు.
ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయన ఎంతకీ లేవగాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తలపై గొడ్డలితో నరకడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధాలే రాంబాబు హత్యకు దారితీసినట్టు స్థానికులు చెప్పుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.