ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకం: చిన్నారి మృతి | police arrests rmp doctor in hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకం: చిన్నారి మృతి

Dec 11 2017 12:03 PM | Updated on Sep 4 2018 5:32 PM

నగరంలోని ముషీరాబాద్‌లో విషాద సంఘటన జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌లో విషాద సంఘటన జరిగింది. వైద్యం వికటించి 14 నెలల చిన్నారి మృతి చెందింది. ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పార్శీగుట్టలో ప్రకాష్‌ అనే వ్యక్తి ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

ఇతని వద్దకు మెహను ఉన్నీసా అనే 14 నెలల బాలికను వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే ప్రకాష్‌ చేసిన వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement