ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూల్ జిల్లా కోస్గిలో జరిగింది.
కోస్గి: ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూల్ జిల్లా కోస్గిలో జరిగింది. పెద్దకడపూర మండలంలోని గదిగట్టు గ్రామానికి చెందిన కావలి వీరన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన కాళ్లు చేతులు కట్టేసి కోస్గిలో రైలు పట్టాలపై పడేశారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


