రెడ్‌క్రాస్‌ సొసైటీకి అవార్డుల పంట | red cross society | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీకి అవార్డుల పంట

Nov 19 2016 11:49 PM | Updated on Sep 4 2017 8:33 PM

జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. వి శాఖలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మ¯ŒS వై.డి.రామారావు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ పి.దుర్గరాజు, కార్యదర్శి సిహెచ్‌.నరసింహరావు, కోశాధికారి జి.శివరామకృష్ణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ నుంచి ఈ అవార్డులు అందుకున్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సభ్యులకు 50 స్వర్ణ పతకాలతో పాటు

కాకినాడ :
 జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. వి శాఖలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మ¯ŒS వై.డి.రామారావు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ పి.దుర్గరాజు, కార్యదర్శి సిహెచ్‌.నరసింహరావు, కోశాధికారి జి.శివరామకృష్ణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ నుంచి ఈ అవార్డులు అందుకున్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సభ్యులకు 50 స్వర్ణ పతకాలతో పాటు  చైర్మ¯ŒS రామారావుకు 2012–13 సంవత్సరానికి గాను సేవా అవార్డు లభించింది. 2013–14కు జి.శివరామకృష్ణ సేవా అవార్డు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ పి.దుర్గరాజుకు బంగారు పతకం అందుకున్నారు. సభ్యత్వాలతోపాటు పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 18 అవార్డులలో అత్యధికంగా తూర్పుగోదావరికే దక్కాయని వై.డి.రామారావు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement