శ్రీయ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం | re postmartam for sriya's deadbody | Sakshi
Sakshi News home page

శ్రీయ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం

Mar 12 2016 2:00 AM | Updated on Sep 18 2019 2:52 PM

హైదరాబాద్ విద్యార్థిని టీఎన్‌ఆర్ శ్రీయ మృతదేహానికి శనివారం తెల్లవారుజామున ఫోరెన్సిక్ అధికారులు రీ పోస్టుమార్టం చేయనున్నారు.

కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్న అధికారులు 

 

జవహర్‌నగర్: హైదరాబాద్ విద్యార్థిని టీఎన్‌ఆర్ శ్రీయ మృతదేహానికి శనివారం తెల్లవారుజామున ఫోరెన్సిక్ అధికారులు రీ పోస్టుమార్టం చేయనున్నారు. విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీయ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ అమ్ముగూడ శ్మశానవాటికలో ఈనెల 4వ తేదీన శ్రీయ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాల్సి ఉండగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వాయిదా వేశారు. శ్రీయ తల్లిదండ్రులు యవన్, ప్రసాద్‌లు కోర్టుకె ళ్లడంతో శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జవహర్‌నగర్ సీఐ నర్సింహారావు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement