అంతటా వర్షం | rain in several areas of anantapur district | Sakshi
Sakshi News home page

అంతటా వర్షం

Aug 11 2017 9:58 PM | Updated on Jun 1 2018 8:39 PM

అంతటా వర్షం - Sakshi

అంతటా వర్షం

వరుణుడి కాస్త కరుణించాడు. మూడు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురుస్తున్నాయి.

- 62 మండలాల్లో 13.1 మి.మీ సగటు నమోదు
- పరిగి, సోమందేపల్లిలో భారీ వర్షం

అనంతపురం అగ్రికల్చర్‌: వరుణుడి కాస్త కరుణించాడు. మూడు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 62 మండలాల పరిధిలో 13.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జూన్‌ మొదటి వారంలో ఈ స్థాయి సగటు నమోదు కాగా, ఇది రెండోది కావడం విశేషం. పరిగిలో 65.4 మి.మీ, సోమందేపల్లి 60.4 మి.మీ భారీ వర్షం కురిసింది. పెనుకొండ 39.1, హిందూపురం 35.8, లేపాక్షి 35.6, రొద్దం 33.6, మడకశిర 31.4, అగళి 30.4, తాడిపత్రి 29.2, రొళ్ల 27.9, బెళుగుప్ప 26, కళ్యాణదుర్గం 23.8, నార్పల 22.9, యల్లనూరు 22.3, శింగనమల 19.9, గుడిబండ 19, తలుపుల 17.4, ఉరవకొండ 16.9, కూడేరు 16.6, పెద్దపప్పూరు 14.7, కనగానపల్లి 14.2, బ్రహ్మసముద్రం 14.1, ఆత్మకూరు 14.1, పుట్లూరు 13.1, కుందుర్పి 10.5 మి.మీ వర్షం కురిసింది. మరో 15 మండలాల్లో తేలికపాటి వర్షం కురవగా, 11 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. 10 మండలాల్లో తుంపర్లు పడగా ఎన్‌పీ కుంట మండలంలో వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 34.7 మి.మీ నమోదైంది.

వర్షసూచన
రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు 10 నుంచి 24 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 36 డిగ్రీలు, కనిష్టం 22 నుంచి 23 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 85 నుంచి 90, మధ్యాహ్నం 62 నుంచి 64 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement