తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం | Railway department emergency meeting effect of Tuni incident | Sakshi
Sakshi News home page

తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం

Jan 31 2016 9:02 PM | Updated on Sep 3 2017 4:42 PM

తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది.

- ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రైల్వే జీఎం గుప్తా

సాక్షి, హైదరాబాద్‌ః తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు.

ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్ టక్కర్, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement