సీపీఎస్‌ రద్దు కోసం పోరాడదాం | protest again cps | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు కోసం పోరాడదాం

Jul 19 2016 10:29 PM | Updated on Sep 4 2017 5:19 AM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్తింపజేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు కోసం దేశ వ్యాప్తంగా పోరాటాలు చేద్దామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాదl్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్‌ పిలుపునిచ్చారు.

♦ ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సన్నశెట్టి
 
రాజాం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్తింపజేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు కోసం దేశ వ్యాప్తంగా పోరాటాలు చేద్దామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాదl్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నగరపంచాయతీ పరిధిలోని అన్ని హైస్కూల్స్‌లో ఆయా ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేంతవరకూ అన్ని శ్రేణుల్లో ఉద్యమాలు కొనసాగాలని కోరారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందించాలన్నారు. ఉపాధ్యాయల బదిలీలకు ప్రతిభ ఆధార పాయింట్లు పెట్టడం సరికాదని, దీన్ని ఏపీటీఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. సమావేశంలో పి.ముఖలింగం, వైవీ రమణ, యండమూరి కృష్ణారావు, బీఏఈబీ శంకరరావు, దాలయ్య, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement