పట్టుబడ్డ వ్యభిచార ముఠా | prostitution gang caught | Sakshi
Sakshi News home page

పట్టుబడ్డ వ్యభిచార ముఠా

Aug 17 2016 11:12 PM | Updated on Aug 21 2018 5:54 PM

పట్టుబడ్డ వ్యభిచార ముఠా - Sakshi

పట్టుబడ్డ వ్యభిచార ముఠా

ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పదిహేను రోజుల కిందట పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని వన్‌టౌన్‌ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో భార్యభర్తలుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. వన్‌టౌన్‌ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాలు...

గతంలో పట్టుబడ్డ నిందితులే కీలక సూత్రధారులు
భార్యభర్తలు పేరిట ఓ అపార్ట్‌మెంట్‌లో కార్యకలాపాలు
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
 
పాత శ్రీకాకుళం : ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పదిహేను రోజుల కిందట పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని వన్‌టౌన్‌ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో భార్యభర్తలుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. వన్‌టౌన్‌ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాలు...స్థానిక టీపీఎం స్కూల్‌ వెనుకనున్న సాయిమౌళి అపార్ట్‌మెంట్‌లో(రూం నంబరు–909) కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాటువేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
భార్యభర్తల పేరిట అసాంఘిక కార్యకలాపాలు
 ఆమదాలవలస మండలం అక్కివరంకు చెందిన తాండ్ర శ్రీనివాసరావుతో పాటు మరో మహిళ భార్యభర్తలుగా చెలామణి అవుతూ కొత్త వ్యక్తులచే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరిద్దరూ విశాఖపట్నం, విజయనగరానికి చెందిన మహిâ¶ ను తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం పట్టుబడ్డ వారిలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. శ్రీనుకు విశాఖపట్నం, విజయనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన  అమ్మాయిలతో  పరిచయాలు ఉన్నాయని  కమీషన్‌ పద్ధతిపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. 15రోజులు క్రితమే శ్రీనుతో పాటు మరో మహిళను వ్యభిచారం కేసులో ఎచ్చెర్ల పోలీస్టేషన్‌ పరిధిలో అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు.
 
రామ్‌ సరసన గెస్ట్‌రోల్‌గా...
ఇదిలా వుండగా పట్టుబడ్డ ముగ్గురి మహిళల్లో  విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ రామ్‌ సరసన ఓ కొత్తసినిమాలో గెస్ట్‌రోల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌ దశలో ఉందని ఆమె వెల్లడించింది.  రాఖీ పండుగ సందర్భంగా తన ఫ్రెండ్‌ ఇంటికి వచ్చానని విలేకరులకు తెలిపింది.  కొన్ని టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు చెప్పింది.
నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం 
పట్టుబడ్డ విటుల నుంచి వన్‌టౌన్‌ పోలీసులు రూ.15వందల రూపాయలు నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement