ఖైదీ పరారీ | prisoner escape | Sakshi
Sakshi News home page

ఖైదీ పరారీ

Jul 6 2017 11:05 PM | Updated on Sep 5 2017 3:22 PM

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డుకు చెందిన బోయ వీరేష్‌(20) అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

ఆదోని రూరల్‌: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డుకు చెందిన బోయ వీరేష్‌(20) అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వీరేష్‌ 2015లో స్థానిక త్రీ టౌన్‌ స్టేషన్‌ పరిధిలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా.. అప్పట్లో రిమాండ్‌కు ఆదేశించింది. అప్పటి నుంచి ఆదోని సబ్‌జైలులో ఉంటున్నాడు. గురువారం తీర్పు ఉండడంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు. ఆదోని ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సాయిరాం కేసు పూర్వపరాలను పరిశీలించి..అతనికి ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. దీంతో వీరేష్‌ను త్రీటౌన్‌ పోలీసులు భాస్కర్,సురేష్‌ సబ్‌ జైలుకు తరలిస్తుండగా.. వారి కళ్లు కప్పి పరారయ్యాడు. ఖైదీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement