ప్రశాంతంగా పోస్టల్‌ పరీక్షలు | postal exams peacefull | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ పరీక్షలు

Jan 30 2017 12:41 AM | Updated on Sep 26 2018 3:25 PM

జిల్లా వ్యాప్తంగా పోస్టుమెన్‌/ మెయిల్‌ గార్డు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ ఆదోని అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా పోస్టుమెన్‌/ మెయిల్‌ గార్డు పరీక్షలు  ప్రశాంతంగా జరిగాయి. యాభై శాతం మంది అభ్యర్థులే హాజరు కావడంతో కొన్ని పరీక్ష కేంద్రాలు బోసిపోయాయి. రాయలసీమ రీజియన్‌ పరిధిలోని నాలుగు జిల్లాలకు సంబంధించి పోస్టుమెన్‌/ మెయిల్‌గార్డు పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆదివారం కర్నూలు 17, ఆదోని 2, నంద్యాల 1, ఆళ్లగడ్డ 1 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 వరకు మొదటి బ్యాచ్‌కి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో బ్యాచ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 5534 మంది హాజరు కాగా 5794 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం  5826 మంది హాజరు కాగా 5303 గైర్హాజరయ్యారు. పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు ఆదోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు బ్యాచ్‌ల్లో హాజరు శాతం వరుసగా 50.59, 48.85 శాతంగా నమోదైందన్నారు. ఒకే రోజున పోస్టుమెన్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్స్‌ పరీక్షలు ఉండటంతో దరఖాస్తు చేసుకున్న సగం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement