చదువు పూర్తయ్యాక మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వివేక్ శర్మ అనే యువకుడు, అమెరికాలో లభించిన భారీ వేతన ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు జాబ్ ఎందుకు వదులుకున్నాడు? దీనికి గల కారణాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వివేక్‌కు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్ సంస్థ నుంచి సంవత్సరానికి దాదాపు 240000 డాలర్ల (సుమారు రూ.2.3 కోట్లు) వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చింది. వీసా స్పాన్సర్‌షిప్, రీలొకేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భావించాడు. అయితే.. అదే సమయంలో అతని తండ్రికి గుండెపోటు రావడం, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం కంటే తల్లిదండ్రుల పక్కన ఉండటం ముఖ్యమని భావించిన వివేక్, ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
Meet Vivek Sharma, a https://t.co/Ws1j7hoGgc Computer Science gold medalist from IIT Bombay, who left a $240,000-a-year (₹2.9 crore) US job to run a small grocery store beneath his house and take care of his parents by staying close to them.
Coming from a simple… pic.twitter.com/7RwTepkL73— Vikas Alwys (@VikasAlwys) July 4, 2026
జాబ్ వదులుకోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడంతో, అతను తన ఇంటి కిందనే చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. ఈ వ్యాపారం ద్వారా కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ, తల్లిదండ్రుల సంరక్షణను కొనసాగించాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన వ్యక్తి ఇలా సాధారణ వ్యాపారం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, వివేక్ తన పనిని విస్తరించాడు. దుకాణాన్ని నిర్వహించడంతో పాటు పేద పిల్లలకు కోడింగ్ బోధించడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. తన నైపుణ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తూ, కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత అదే అమెరికన్ కంపెనీ మళ్లీ అతనిని సంప్రదించి, ఈసారి రిమోట్‌గా పని చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. దీంతో అతను తన స్వస్థలమైన కాన్పూర్‌లోనే ఉండి టెక్నాలజీ, బోధన, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: జియో రూ.448 Vs ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్?


