రుద్రంపేటలో పోలీసుల భద్రత కట్టుదిట్టం | police protection in rudrampeta | Sakshi
Sakshi News home page

రుద్రంపేటలో పోలీసుల భద్రత కట్టుదిట్టం

Jul 21 2016 11:45 PM | Updated on Sep 29 2018 4:52 PM

జంట హత్యలతో ఉలిక్కిపడిన రుద్రంపేటలో మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : జంట హత్యలతో ఉలిక్కిపడిన రుద్రంపేటలో మళ్ళీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మృతులు, నిందుతుల నివాస ప్రాంతాలు ఒకే ప్రాంతం కావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. మొబైల్‌ వాహనాల్లో పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. స్పెషల్‌పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. నగరంలో ఉండే ఎస్‌ఐలు, సీఐలు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు గుంపులగా కనిపిస్తే వెంటనే అక్కడ నుంచి పంపించేస్తూ గట్టి చర్యలు తీసుకుంటున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement