భర్త వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బార్య కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది.
కలెక్టరేట్ ఎదుట కానిస్టేబుల్ భార్య ధర్నా
Dec 8 2016 6:36 PM | Updated on Mar 19 2019 6:01 PM
కరీంనగర్: భర్త వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బార్య కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా భార్య లలితను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన లలిత పిల్లలతో కలిసి గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ ఎదుటే కూర్చుంటానని పట్టుబట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement


