ఇద్దరు రేషన్‌డీలర్లపై 6ఏ కేసు | police case on ration dealers | Sakshi
Sakshi News home page

ఇద్దరు రేషన్‌డీలర్లపై 6ఏ కేసు

Aug 10 2016 10:41 PM | Updated on Sep 4 2017 8:43 AM

ఇల్లంతకుంట: రేషన్‌ బియ్యం, చక్కెర ప్యాకెట్లను అక్రమంగా విక్రయించారన్న సమాచారం మేరకు విజిలెన్స్, పౌరసఫరాల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇల్లంతకుంట మండలం కందికొట్కూర్‌లో ఇద్దరు రేషన్‌ డీలర్లపై 6ఏ కేసు నమోదు చేశారు. గ్రామంలోని 315, 316 నెంబర్ల రేషన్‌ దుకాణాలపై దాడులు చేసి డీలర్లు లక్ష్మి, స్వామిపై కేసు నమోదు చేశారు.

ఇల్లంతకుంట: రేషన్‌ బియ్యం, చక్కెర ప్యాకెట్లను అక్రమంగా విక్రయించారన్న సమాచారం మేరకు విజిలెన్స్, పౌరసఫరాల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇల్లంతకుంట మండలం కందికొట్కూర్‌లో ఇద్దరు రేషన్‌ డీలర్లపై 6ఏ కేసు నమోదు చేశారు. గ్రామంలోని 315, 316 నెంబర్ల రేషన్‌ దుకాణాలపై దాడులు చేసి డీలర్లు లక్ష్మి, స్వామిపై కేసు నమోదు చేశారు. లక్ష్మి దుకాణంలో రెండు క్వింటాళ్ళ 36 కిలోల బియ్యం, 29 చక్కెర ప్యాకెట్లు, స్వామి దుకాణంలో 1.25 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం, 30 చక్కెర ప్యాకెట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా, దుకాణంలో సరుకుల నిల్వ చూపకుండా అక్రమంగా విక్రయించినట్లు అధికారులు నిర్ధరించారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐ రవీందర్, సిరిసిల్ల, వేములవాడ డీటీ సీఎస్‌లు వహీదొద్దిన్, రవీందర్‌రావు, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్, ఆర్‌ఐ భూపేశ్‌ రెడ్డి, వీఆర్వో ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement