మంత్రి కార్యక్రమంలో జేబు దొంగల హల్‌చల్ | Pick pocketings at Minister meeting | Sakshi
Sakshi News home page

మంత్రి కార్యక్రమంలో జేబు దొంగల హల్‌చల్

Apr 25 2016 6:10 PM | Updated on Sep 3 2017 10:43 PM

హాలియా మండలం తిరుమలగిరి గ్రామంలో సోమవారం మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో జేబు దొంగలు చెలరేగిపోయారు.

హాలియా  (నల్లగొండ జిల్లా) : హాలియా మండలం తిరుమలగిరి గ్రామంలో సోమవారం మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో జేబు దొంగలు చెలరేగిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూమి పూజలో మంత్రితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే దొంగలు చేతివాటం చూపించారు. పలువురి నుంచి మొత్తం రూ.18,700 కాజేశారు. దుర్గారావు జేబు నుంచి రూ.7,500, రమేశ్ దగ్గర రూ.8వేలు, వీఆర్‌ఏ నర్సింహ దగ్గర రూ.3వేలు, నాగయ్య అనే వ్యక్తి జేబు నుంచి రూ.200 కొట్టేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement