బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. | Penagaluru People killed in Kuwait | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..

Dec 26 2016 10:41 PM | Updated on Sep 4 2017 11:39 PM

బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..

బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండలంలోని కొండూరు పంచాయతీ వీఎంపురానికి చెందిన సానేపల్లె నరసింహులు(48) ఆదివారం కువైట్‌లో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

- పెనగలూరు వాసి కువైట్‌లో మృతి
పెనగలూరు: బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండలంలోని కొండూరు పంచాయతీ వీఎంపురానికి చెందిన సానేపల్లె నరసింహులు(48) ఆదివారం కువైట్‌లో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కువైట్‌కు వెళ్లి బిల్డింగ్‌ పని చేస్తుండగా రెండవ అంతస్తు నుంచి కాలు జారి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. కువైట్‌లో ఉన్న తమ బంధువులు విషయం తెలిపారని చెప్పారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement