రేషన్‌ బియ్యం పట్టివేత | pds rice Capture | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Sep 24 2016 7:40 PM | Updated on Sep 2 2018 3:46 PM

సుల్తానాబాద్‌: మండల కేంద్రంలోని శ్రీరాంపూర్‌ కూడలి వద్ద ఆటోలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని శనివారం వాహనాల తనీఖీలో పట్టుకున్నట్లు ఎస్సై జీవన్‌ తెలిపారు.

సుల్తానాబాద్‌: మండల కేంద్రంలోని శ్రీరాంపూర్‌ కూడలి వద్ద ఆటోలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని శనివారం వాహనాల తనీఖీలో పట్టుకున్నట్లు ఎస్సై జీవన్‌ తెలిపారు. సుల్తానాబాద్‌ మార్కండేయ కాలనీకి చెందిన బండారి వంశి అనే వ్యక్తి ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని ఆటోను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని పంచనామా కోసం డీటీసీఎస్‌ అధికారులకు సిఫార్సు చేశామన్నారు. 

ఇసుక ఆటో పట్టివేత 
సుల్తానాబాద్‌ మండలంలోని కదంబాపూర్‌ నుంచి పెద్దపల్లికి సన్నపు (జీరో) ఇసుకను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా శివాలయం వద్ద శనివారం పట్టుకున్నట్లు ఎస్సై జీవన్‌తెలిపారు. మైనింగ్‌ అధికారులకు జరిమానా కోసం సిఫార్సు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement