నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్‌ | overall championship for nandyal citizen | Sakshi
Sakshi News home page

నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్‌

Jan 16 2017 10:13 PM | Updated on Sep 5 2017 1:21 AM

నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్‌

నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్‌

రాష్ట్రస్థాయి బహిరంగ శరీర సౌష్టవ పోటీల్లో నంద్యాలకు చెందిన సుధీర్‌ (బంగారు పతకం ) ఏపీ చాంపియన్‌గా నిలిచారు.

- భీమవరంలో శరీర సౌష్టవ పోటీలు
- నాల్గు విభాగాల్లో నంద్యాల వాసుల ప్రతిభ
కర్నూలు (టౌన్‌) :  రాష్ట్రస్థాయి బహిరంగ శరీర సౌష్టవ పోటీల్లో నంద్యాలకు చెందిన సుధీర్‌ (బంగారు పతకం ) ఏపీ చాంపియన్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ బాడి బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15వతేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటేష్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. 65 కేజీల విభాగంలో సుధీర్‌ చాంపియన్‌గా నిలిచాడన్నారు. అలాగే నంద్యాలకే చెందిన సురేష్‌, ఫయాజ్‌, కరీముల్లా వరుసగా 75 కేజీలు, 85 కేజీలు, 90 కేజీల విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement