బైకర్‌... మేకోవర్‌ | Sharwanand Stunning Body Transformation for Biker Movie | Sakshi
Sakshi News home page

బైకర్‌... మేకోవర్‌

Oct 26 2025 4:13 AM | Updated on Oct 26 2025 4:13 AM

Sharwanand Stunning Body Transformation for Biker Movie

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘శర్వానంద్‌ కెరీర్‌లో 36వ చిత్రంగా ‘బైకర్‌’ రూపొందుతోంది. స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రోఫెషనల్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌ పాత్రలో కనిపించబోతున్నారాయన. 

ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఫిజికల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ అయ్యారు శర్వా. పాత్రకు సరిపడేలా లీన్‌ అండ్‌ అథ్లెటిక్‌ బాడీని తీర్చిదిద్దుకున్నారు. శర్వా కొత్త లుక్, కథ, కాన్సెప్ట్, టాప్‌ టెక్నికల్‌ టీమ్‌.. ఇవన్నీ కలసి ‘బైకర్‌’ సినిమాను ఒక థ్రిల్లింగ్‌ ఎమోషనల్‌ రైడ్‌గా మార్చబోతున్నాయి. ఈ మూవీ ద్వారా అభిమానులు ఆయన్ని కొత్త లుక్‌లో చూడటానికి ఎదురు చూస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ‘బైకర్‌’ టైటిల్, ఫస్ట్‌ లుక్‌  పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి కెమెరా: జె. యువరాజ్, సంగీతం: జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: ఎన్‌. సందీప్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement