ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం కింద సేంద్రియ సాగు కోసం మండలం ఎంపికైందని వ్యవసాయాధికారి వజల రత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోహీర్: ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం కింద సేంద్రియ సాగు కోసం మండలం ఎంపికైందని వ్యవసాయాధికారి వజల రత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోహీర్ మండలంతో పాటు గజ్వేల్, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలు కూడా ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఎంపికైన ఒక్కో మండలంలో పది గ్రామాలు, అలాగే ఒక్కో గ్రామం నుంచి ఆసక్తి ఉన్న వంద మంది రైతులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.