జిల్లా మీదుగా మరో రైలు | onther train on district root | Sakshi
Sakshi News home page

జిల్లా మీదుగా మరో రైలు

Jun 25 2016 12:16 AM | Updated on Sep 4 2017 3:18 AM

జిల్లా మీదుగా మరో రైలు

జిల్లా మీదుగా మరో రైలు

సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో శుక్రవారం మరో రైలు ప్రారంభమైంది.

సికింద్రాబాద్- నిజామాబాద్ మార్గంలో స్పెషల్ డెమో
అక్కన్నపేట, శ్రీనివాస్‌నగర్ రైల్వేస్టేషన్లలో హాల్టింగ్

చిన్నశంకరంపేట: సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో శుక్రవారం మరో రైలు ప్రారంభమైంది. 07277 నంబర్ స్పెషల్ డెమో రైలు మల్కాజిగిరి, బొల్లారం, మేడ్చల్, శ్రీనివాస్‌నగర్, అక్కన్నపేట, కామారెడ్డి, డిచ్‌పల్లి, నిజామాబాద్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఇది వారంలో ఐదు రోజులే నడవనుంది. దీనిని మీర్జాపల్లి, వడియారం రైల్వే స్టేషన్‌లలోనూ ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వేళలు ఇలా...
ఉదయం 07.26కి నిజామాబాద్‌లో ప్రారంభమై మెదక్ జిల్లా అక్కన్నపేటకు 08.31కి చేరుతుంది.
ఇక్కడ నుంచి మాసాయిపేట శ్రీనివాస్ నగర్ రైల్వేస్టేషన్‌కు 09-08కు, మల్కాజిగిరికి 10.21 నిమిషాలకు చేరుకుంటుంది.
తిరిగి సాయంత్రం 4.01కి మల్కాజిగిరి నుంచి ప్రారంభమై శ్రీనివాస్‌నగర్‌కు 5కి, అక్కన్నపేట 5.39కి చేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement