ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య | one person suicide with financial problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Aug 21 2016 12:21 AM | Updated on Nov 6 2018 8:04 PM

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ హమాలీ కార్మికుడు శని వారం ఆత్మహత్యకు పాల్పడినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్‌ తెలిపారు.

కాజీపేట : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ హమాలీ కార్మికుడు శని వారం ఆత్మహత్యకు పాల్పడినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. బాపూజీనగర్‌కు చెందిన మాటేటి ఉపేందర్‌(30) మడికొండ లిక్కర్‌ గోడౌన్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఆయన తాగుడుకు బా నిసగా మారాడు. మరోవైపు అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పులను తీర్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలయ్యాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో ఒంటరిగా ఉంటున్న ఉపేందర్‌ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement