నేడు నర్సరీ అసోసియేషన్‌ ఎన్నికలు | nursery accosiations elections | Sakshi
Sakshi News home page

నేడు నర్సరీ అసోసియేషన్‌ ఎన్నికలు

Sep 30 2016 11:35 PM | Updated on Aug 14 2018 5:56 PM

నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ శని వారం జరుగుతుంది. కడియపులంక ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక గుర్తి ంపు కార్డు కలిగిన సభ్యులను ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం ఎన్నిక నిర్వాహక కమిటీ .. పోలీసు, రెవెన్యూ, ఉపాధ్యాయుల సహకారాన్ని కో రింది. వారి సూచనల మేరకు బూత్‌ల ఏర్పాటు, ఇతర సదుపాయాలను ఆయా అధికారులు, నర్సరీ రంగ పెద్దలు,

కడియం :
నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ శని వారం జరుగుతుంది. కడియపులంక ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక గుర్తి ంపు కార్డు కలిగిన సభ్యులను ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం ఎన్నిక నిర్వాహక కమిటీ .. పోలీసు, రెవెన్యూ, ఉపాధ్యాయుల సహకారాన్ని కో రింది. వారి సూచనల మేరకు బూత్‌ల ఏర్పాటు, ఇతర సదుపాయాలను ఆయా అధికారులు, నర్సరీ రంగ పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే బూత్‌లను ఏర్పాటు చేశారు. అసోసియేష¯Œæలో 1346 మంది సభ్యులున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement