పెళ్లి కాలేదని.. | no marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి కాలేదని..

Nov 25 2016 11:47 PM | Updated on Nov 6 2018 7:56 PM

సంగపట్నం గ్రామంలో పెళ్లి కాలేదని ఓ యువకుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట శివరామిరెడ్డి(24) పొలం పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు.

సంగపట్నం(అవుకు):  సంగపట్నం గ్రామంలో పెళ్లి కాలేదని  ఓ యువకుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన  నాగిరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట శివరామిరెడ్డి(24) పొలం పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కొంత కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఎక్కడ నిశ్చయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు బనగానపల్లె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు.      
 

Advertisement
 
Advertisement
Advertisement