నాడు...నేడు | nanna -daddy | Sakshi
Sakshi News home page

నాడు...నేడు

Jun 17 2017 11:46 PM | Updated on Sep 5 2017 1:52 PM

ఎదురు పడితే భయం ... మాట్లాడాలంటే ‘అమ్మో’ ... కన్నెర్ర చేస్తే గజగజ ... గద్దిస్తే ఇక జ్వరమే

 
నాటి నాన్న...
ఎదురు పడితే భయం ... మాట్లాడాలంటే ‘అమ్మో’ ... 
కన్నెర్ర చేస్తే గజగజ ... గద్దిస్తే ఇక జ్వరమే
పుస్తకం, పెన్ను, పెన్సిల్‌,  ఏ అవసరమున్నా 
అమ్మే మధ్యవర్తి
జిహ్వ చాపల్యం తీర్చుకోవాలన్నా, నేత్రానందం తీరాలన్నా
కన్న తల్లే నిచ్చెన...
.
నాన్నకు కోపం వచ్చి కొట్టడానికి నా పైకి వస్తే
అడ్డుకున్న పుణ్యానికి సగం దెబ్బలు అమ్మకే
మిగిలిన అరకొరే నాపైకి...
.
నేటి డాడీ...
.
తరం మారింది... స్వరం మారిపోయింది
అమ్మ కొడితే...తిడితే
వెనుకేసుకొచ్చే డాడీలొచ్చేశారు
.
ఇన్నాళ్లూ వంతెనగా నిలిచిన అమ్మ పాత్ర అదృశ్యమైంది
ఏ ఆనందమైనా చిటికెలో
తీర్చే నాన్న అనురాగం సాక్షాత్కరించింది
.
అమ్మకు కోపం వస్తే నాన్నే అడ్డుపడి...
గుండెలపై కాదు ... తన భుజాలపై 
కొలువుదీరనిచ్చి...ఆప్యాయతలు పంచి
అనురాగాలతో పెంచిన 
కనిపించిన దేవుళ్లు 
నేటి మన డాడీలు...
 
 
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement