సిద్ధాపూర్‌లో మహేష్‌బాబు భార్య
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో శుక్రవారం హీరో మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్ పర్యటించారు.
కొత్తూర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో శుక్రవారం హీరో మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్ పర్యటించారు. సిద్దాపూర్‌ను మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా నమ్రత గ్రామంలో ‘హీల్ ఏ చైల్డ్’ పేరుతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో 14 ఏళ్ల లోపు పిల్లలకు వైద్య సేవలు అందించారు. దాదాపు 300 మంది చిన్నారులకు పరీక్షలు చేసి, చికిత్సలు చేశారు.
అనంతరం ఆమె గ్రామంలోని వీధుల్లో కలియ దిరిగారు. గ్రామస్తులతో మాట్లాడి ముఖ్యమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో చర్చించి, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారికి చెప్పారు.


