breaking news
Hero Maheshbabu
-
సిద్ధాపూర్లో మహేష్‌బాబు భార్య
కొత్తూర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో శుక్రవారం హీరో మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్ పర్యటించారు. సిద్దాపూర్ను మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా నమ్రత గ్రామంలో ‘హీల్ ఏ చైల్డ్’ పేరుతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో 14 ఏళ్ల లోపు పిల్లలకు వైద్య సేవలు అందించారు. దాదాపు 300 మంది చిన్నారులకు పరీక్షలు చేసి, చికిత్సలు చేశారు. అనంతరం ఆమె గ్రామంలోని వీధుల్లో కలియ దిరిగారు. గ్రామస్తులతో మాట్లాడి ముఖ్యమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో చర్చించి, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారికి చెప్పారు. -
సిద్ధాపూర్‌కు 'మహేష్‌బాబు' ప్రతినిధులు
కొత్తూరు (మహబూబ్‌నగర్) : సిద్దాపూర్ గ్రామ పెద్దలతో హీరో మహేష్‌బాబు ముఖాముఖికి తేదీ ఖరారైంది. గ్రామస్తులతో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామానికి దత్తత తీసుకోనున్నట్లు గత నెల 28వ తేదీన ప్రిన్స్ మహేష్‌బాబు ప్రకటించిన విషయం విదితమే. దీంతో తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు వస్తారోనని ఆ పల్లెవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కారణాలతో ఆయన అక్కడికి వెళ్లలేదు. గ్రామానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు మంగళవారం మహేష్ బాబు తన ప్రతినిధులు కొందరిని అక్కడకు పంపించారు. వారు స్థానిక నేతలతో సమావేశమై ప్రధాన సమస్యలు, పరిష్కారాలపై చర్చలు జరిపారు. ఈ ప్రతినిధి బృందంలో కందుకూరి భూపాల్‌రెడ్డి, మధు, కృష్ణ, మహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ ఘోరీ తదితరులు ఉన్నారు. వారు సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్యతో పాటు యువకులు, నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో మహేశ్‌బాబు.. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ బాలయ్య, తదితరులతో దత్తతపై చర్చించనున్నట్లు వారు వెల్లడించారు.


