మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరు: ఓదేలు | nallala odelu takes on tdp leaders | Sakshi
Sakshi News home page

మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరు: ఓదేలు

May 21 2016 1:49 PM | Updated on Aug 10 2018 9:42 PM

మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరని తెలుగుదేశం పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సూచించారు.

ఆదిలాబాద్: మహానాడుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టలేరని తెలుగుదేశం పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో నల్లాల ఓదేలు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ పట్టమే ఉప ఎన్నికల ఫలితాలని ఆయన అభివర్ణించారు. తెలంగాణ జిల్లాల్లో మినీ మహానాడులను టీడీపీ నిర్వహిస్తుండడంపై ఓదేలు విమర్శించారు. తెలంగాణ నాయకులు బాబు పల్లకీ మోయడం ఆత్మవంచన చేసుకోవడమేనని నల్లాల ఓదేలు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement