సానియాను మాకు అప్పగించండి | murdered sindhiya parents protest for sania in shamshabad | Sakshi
Sakshi News home page

సానియాను మాకు అప్పగించండి

Jul 7 2016 4:21 AM | Updated on Jul 30 2018 8:29 PM

సానియాను మాకు అప్పగించండి - Sakshi

సానియాను మాకు అప్పగించండి

సింథియాను దారుణంగా హత్యచేసిన రూపేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ ఆమె బంధువులు బుధవారం రాత్రి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

 పోలీస్‌స్టేషన్ ఎదుట సింథియా బంధువుల ఆందోళన
 
 శంషాబాద్ : కాంగో దేశానికి చెందిన సింథియా బంధువులు సానియాను తమకు అప్పగించాలని బుధవారం ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్‌తోపాటు అతడి బంధువులు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయకూడదంటూ డిమాండ్ చేశారు.

తన అక్కను హత్య చేసిన హంతకుడు భవిష్యత్తులో అతడి కూతురు సానియాను కూడా హతమారుస్తాడని ఆరోపించారు. సానియాను తమకు చూపించాలని, తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రూపేష్ తల్లి వద్దనున్న సానియాను ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి వారికి చూపించారు. సానియాను తిరిగి రూపేష్ తల్లి వద్దకు పోలీసులు చేర్చారు. పోలీసులు సముదాయించడంతో పోలీస్‌స్టేషన్ నుంచి మదన్‌పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన స్థలానికి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement