జగన్ సహా 13 మందిపై కేసు | mla naredra files complaint on sakshi | Sakshi
Sakshi News home page

జగన్ సహా 13 మందిపై కేసు

Mar 7 2016 2:32 AM | Updated on Aug 20 2018 8:20 PM

జగన్ సహా 13 మందిపై కేసు - Sakshi

జగన్ సహా 13 మందిపై కేసు

సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లలో టీడీపీకి, తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు వచ్చాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

‘సాక్షి’పై ఎమ్మెల్యే నరేంద్ర ఫిర్యాదు
తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాశారంటూ పొన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


పొన్నూరు: సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లలో టీడీపీకి, తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు వచ్చాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్ ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇందుకు బాధ్యులైన కె. రామచంద్రమూర్తి (ప్రింటర్, పబ్లిషర్ ఆఫ్ సాక్షి తెలుగు డైలీ న్యూస్‌పేపర్), వి.మురళి (ఎడిటర్), వైఎస్ భారతీరెడ్డి (చైర్‌పర్సన్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్), జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ డెరైక్టర్‌లు హన్నప్పనహల్లి వీరన్న ఈశ్వరయ్య, వై.ఈశ్వరప్రసాదరెడ్డి, వి.శ్రీధరరెడ్డి, రాజప్రసాదరెడ్డి, పి.వి.కె.ప్రసాద్, ప్రకాశరావు అంతుర్ నారాయణ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డెరైక్టర్లు ఎల్.బలరాంరెడ్డి, వీర్మణి బాలరాజు, బండి రాణిరెడ్డి, వైఎస్ జగన్ (పొలిటికల్ మెంటర్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్), ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement