తల్లి చెంతకు వివాహిత | missing woman found in srikakulam | Sakshi
Sakshi News home page

తల్లి చెంతకు వివాహిత

May 17 2016 10:21 AM | Updated on Sep 2 2018 4:48 PM

సారవకోట మండలంలోని అలుదు గ్రామానికి చెందిన వివాహిత తోటాడ నీలవేణి (21)ని సోమవారం పాతపట్నం సీఐ శ్రీనివాసరావు ఆమె తల్లి తవిటమ్మకు అప్పగించారు.

శ్రీకాకుళం: సారవకోట మండలంలోని అలుదు గ్రామానికి చెందిన వివాహిత తోటాడ నీలవేణి (21)ని సోమవారం పాతపట్నం సీఐ శ్రీనివాసరావు ఆమె తల్లి తవిటమ్మకు అప్పగించారు. ఏడాది క్రితం తన కుమార్తె కనిపించడం లేదని తవిటమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా సోమవారం నీలవేణి గుర్తించి ఆమె తల్లికి అప్పగించినట్టు సీఐ తెలిపారు. అయితే కేసు నమోదు చేసినప్పటికి ఆమె అవివాహితని, ప్రస్తుతం వివాహం అయి, ఒక బిడ్డకు తల్లికూడానని ఆయన తెలిపారు. సీఐతో పాటు ట్రైనీ ఎస్‌ఐ మధుసూదనరావు, ఏఎస్‌ఐ ఎంఆర్కే రెడ్డి, హెచ్‌సీ శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement