అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షలు | missing kid adith father srinivasa rao announces cash reward of Rs 5 lakh on identify | Sakshi
Sakshi News home page

అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షలు

Sep 30 2015 8:07 PM | Updated on May 3 2018 3:17 PM

అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షలు - Sakshi

అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షలు

ఆరేళ్ల చిన్నారి అదితి ఆచూకీ చెబితే 5 లక్షలు రూపాయిలు ఇస్తామని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు

విశాఖ :  ఆరేళ్ల చిన్నారి అదితి ఆచూకీ తెలిపినవారికి 5 లక్షలు రూపాయిలు బహుమతి ఇస్తామని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ మృతదేహం ఎక్కడా దొరక్కపోవడం వల్ల తాము ఇంకా అదితి బతికే ఉందనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.  పొలీసుల తరఫు నుంచి ఒక నోడల్ టీంగా ఏర్పడ్డాయని, సముద్రంలో ఇవాళ కూడా మరబోట్ల ద్వారా గాలింపు చేశామని చెప్పారు.

ఇప్పటివరకూ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రంలో గాలింపు చేశామని, నిర్మానుష్యంగా ఉన్న బీచ్ ప్రాంతాల్లో సోదాలు చేయమని జిల్లా కలెక్టర్ను కోరినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అదితి ఆచూకీ తెలిస్తే 9701000564 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు ఎవరి పైనా అనుమానం లేదని, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే సజీవంగా అప్పగించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement