త్వరలో తెలంగాణ మొక్కు తీర్చుకోనున్న కేసీఆర్ | Minister Indrakaran Reddy visits Tirumala | Sakshi
Sakshi News home page

త్వరలో తెలంగాణ మొక్కు తీర్చుకోనున్న కేసీఆర్

Feb 5 2016 7:18 PM | Updated on Aug 14 2018 10:54 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తిరుమలేశునికి బంగారు కానుకలు సమర్పించాలని కేసీఆర్ మొక్కుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

తిరుమల : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తిరుమలేశునికి బంగారు కానుకలు సమర్పించాలని కేసీఆర్ మొక్కుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ నెల మూడో వారంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు కూడా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement