గని కార్మికుడు మృతి | mine worker died | Sakshi
Sakshi News home page

గని కార్మికుడు మృతి

May 1 2017 11:16 PM | Updated on Sep 5 2017 10:08 AM

నాపరాళ్ల గనిలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

కొలిమిగుండ్ల: నాపరాళ్ల గనిలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య (39) అదే గ్రామానికి చెందిన పుల్లారెడ్డి నాపరాతి గనిలో సోమవారం కూలీకి వెళ్లాడు. కటింగ్‌ మిషన్‌తో కోత కోసిన ఆరడుగల ఎత్తైన నాపరాయిని వెలికి తీసి వరుసలో పెట్టేక్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అతని తలపై నాపరాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు గణేష్‌ ఉన్నారు. ఏఎస్‌ఐ ఉస్మాన్‌ఘని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement