తాడిచర్ల కోల్‌-2 సింగరేణికి.. కిషన్‌రెడ్డి | We have allocated the Tadicherla coal mine to Singareni: Kishan Reddy | Sakshi
Sakshi News home page

తాడిచర్ల కోల్‌-2 సింగరేణికి.. కిషన్‌రెడ్డి

Jul 7 2026 3:47 PM | Updated on Jul 7 2026 3:57 PM

We have allocated the Tadicherla coal mine to Singareni: Kishan Reddy

సాక్షి, ఢిల్లీ: తాడిచెర్ల-2 కోల్‌  సింగరేణి కి కేటాయించామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ ఫైలుపై సంతకం చేశానని తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్తశుద్ధి తో ఉన్నారనేదానికి ఇదే సంకేతమని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలని తెలిపారు.

కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బ్లాక్‌ కేటాయించడం ద్వారా 50 ఏళ్ల పాటు ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి దీనివల్ల ఏడాది కి 60 వేల కోట్ల ఆదాయం సింగరేణికి వస్తుంది.తెలంగాణ ప్రభుత్వానికి 16 వేల కోట్ల ఆదాయం వస్తుంది.182 మిలియన్ టన్నుల బొగ్గు అక్కడ అందుబాటులో ఉంది.సింగరేణి తాడిచెర్ల లో కొత్తగా 12 వందల ఉద్యోగాలు నైనీ కోల్ బ్లాక్ లో కొత్తగా 1500 ఉద్యోగాలు వస్తాయి. 75 వేల కోట్ల రెవెన్యూ నైనీ కోల్ బ్లాక్ నుంచి వస్తుంది అన్నారు.

ప్రస్తుతం నష్టాల్లో ఉన్న సింగరేణి  మెల్లమెల్లగా కోలుకుంటుందని, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు వేలం పాటలో సింగరేణి పాల్గొనాలని తెలిపారు. సింగరేణి పాలనలో కేంద్రానికి ఎలాంటి ప్రమేయం ఉండదని ఒక్క అధికారిని కూడా  కేంద్రం బదిలీ చేయలేదని పేర్కొన్నారు. సలహా ఇచ్చే అవకాశం మాత్రమే తమకుంటుంది తప్ప వేరేదేది లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement