'మంత్రి పుల్లారావుకు దళితులంటే చులకన' | merugu nagarjuna takes on prathipati pulla rao | Sakshi
Sakshi News home page

'మంత్రి పుల్లారావుకు దళితులంటే చులకన'

Jul 5 2016 1:11 PM | Updated on May 29 2018 2:42 PM

గుంటూరు జిల్లా ఎడవల్లిలోని రైతులు భూములు లాక్కోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

గుంటూరు : గుంటూరు జిల్లా ఎడవల్లిలోని రైతులు భూములు టీడీపీ ప్రభుత్వం లాక్కోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పి.పుల్లారావుకు దళితులంటే చులకన భావం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. అందుకే వారి భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని మంత్రిపై ఆయన మండిపడ్డారు.

రూ. 5 వేల కోట్ల మైనింగ్ కోసం వందలాది దళిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు కూడా మంత్రికి వత్తాసు పలకడం దుర్మార్గం అని ఆయన పేర్కొన్నారు. దళితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఎంతదాకా నైనా పోరాడతామని మేరుగ నాగార్జున వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement