మాంసం విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు | meet marchant arrested | Sakshi
Sakshi News home page

మాంసం విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు

Oct 3 2016 12:23 AM | Updated on Aug 20 2018 4:44 PM

నేరేడుచర్లలోని మిర్యాలగూడ రోడ్‌లో గాంధీ జయంతి రోజైన ఆదివారం గోవధ చేసి మాంసాన్ని

నేరేడుచర్ల : నేరేడుచర్లలోని మిర్యాలగూడ రోడ్‌లో గాంధీ జయంతి రోజైన ఆదివారం గోవధ చేసి మాంసాన్ని విక్రయిస్తున్న సంఘటన చోటు చేసుకుంది. గాంధీ జయంతి రోజు మధ్యం, మాంసం విక్రయాలు చేపట్టరాదని గ్రామపంచాయతీ వారు ఒక రోజు ముందుగానే వ్యాపారస్తులకు సూచించారు. మిర్యాలగూడ రోడ్‌లో షేక్‌ గౌస్‌ గోమాంస విక్రయ కేంద్రంలో ఆవును వధించి మాంసం విక్రయిస్తుండగా స్థానికులు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది హుటహుటిన అక్కడకు చేరుకుని మాంసం విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాంసం విక్రయదారులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి వాగ్వాదాం జరిగింది.  దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మాంసం విక్రయిస్తున్న షేక్‌ గౌస్, విద్యానగర్‌లో మాంసం విక్రయం చేస్తున్న నర్సింహను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement