ధ్యానంతో ఆధ్యాత్మిక ఉన్నతి | Meditation leads to Spiritual highness | Sakshi
Sakshi News home page

ధ్యానంతో ఆధ్యాత్మిక ఉన్నతి

Aug 17 2016 4:56 PM | Updated on Sep 4 2017 9:41 AM

ఉత్తరాఖండ్‌లోని హట్‌ వేదానంద తపోవన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరమహంస శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్‌ సీతానగరంలోని పుష్కర ఘాట్‌లో మంగళవారం స్నానం చేశారు.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌): ఉత్తరాఖండ్‌లోని హట్‌ వేదానంద తపోవన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరమహంస శ్రీ వేదానంద సరస్వతి మహారాజ్‌ సీతానగరంలోని పుష్కర ఘాట్‌లో మంగళవారం స్నానం చేశారు. ధ్యానం, యోగ సాధనపై భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వం అలవరచుకొని కర్మను, బాంధవ్యాలను విడిచి పెట్టకుండా జ్ఞాన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. తాను శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్‌ గురువు వద్ద శిష్యరికం చేసి జ్ఞాన సముపార్జన చేశానన్నారు. సమస్త మానవాళి మానసిక ప్రశాంతతకు ధ్యానం ఒక్కటే మార్గమని భక్తులకు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement