హాస్టల్ భవనంపై నుంచి దూకి.. | medico jumps off from hostel building | Sakshi
Sakshi News home page

హాస్టల్ భవనంపై నుంచి దూకి..

Dec 1 2016 12:02 PM | Updated on Nov 6 2018 7:56 PM

హాస్టల్ భవనంపై నుంచి దూకి.. - Sakshi

హాస్టల్ భవనంపై నుంచి దూకి..

జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

రాజమహేంద్రవరం: జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. కొంతకాలంగా శుభను నలుగురు విద్యార్థులు వేధిస్తున్నట్లు ఆమె ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 
 
ర్యాగింగ్ పై కాలేజి కమిటీని కూడా నియమించినట్లు తెలిపారు. వేధింపుల కారణంగా శుభ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని చెప్పారు. గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యయత్నాలు చేసినట్లు యాజమాన్యం చెప్పినట్లు తెలిపారు. శుభశ్రీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెల్లవారేదాకా ఎవరూ గమనించలేదని తెలిపారు. గురువారం వేకువజామున తోటి వారు ఆమె చనిపోయి ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement