11 నుంచి 'మనగుడి' | managudi from 11th | Sakshi
Sakshi News home page

11 నుంచి 'మనగుడి'

Oct 29 2016 10:58 PM | Updated on Sep 4 2017 6:41 PM

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 11 నుంచి 14 వరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆలయాల్లో మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాలు జరగనున్నాయని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(కల్చరల్‌) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 11 నుంచి 14 వరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆలయాల్లో మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాలు జరగనున్నాయని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 11న జిల్లాలో ఎంపిక చేసిన దళిత వాడల్లోని పది ఆలయాల్లో మంగళకైశికి పూజలు, 12న ఆలయ శోభ, 13న సంకీర్తనలు, భజనలు, 14న జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోని పది శివాలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. శివాలయాల్లో శ్రీవారి పాదముల వద్ద ఉంచిన కంకణధారణ, అక్షింతలు, కలకండ భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 530 శివాలయాల్లో 14న మనగుడి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. అదే రోజున జిల్లాలో ఎంపిక చేసిన ఒక శివాలయంలో బిల్వార్చన నిర్వహించనున్నామన్నారు. శ్రీవారి సేవకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 
31న ధర్మప్రచార మండలి సమావేశం..
మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాల నిర్వహణ గురించి చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక సి.క్యాంప్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ధర్మప్రచార మండలి సభ్యుల సమావేశం జరగనున్నదని సభ్యులందరూ ఈ సభలో పాల్గొనాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య విజ్ఞప్తి చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement