ప్రాణం కాపాడారు | Life saved | Sakshi
Sakshi News home page

ప్రాణం కాపాడారు

Aug 16 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:31 AM

ప్రాణం కాపాడారు

ప్రాణం కాపాడారు

జోరున వాన కురుస్తోంది. వర్షంలో స్పర్శ లేనంతగా చావు బతుకుల మధ్య ఓ అభాగ్యుడు.

డాబాగార్డెన్స్‌ : జోరున వాన కురుస్తోంది. వర్షంలో స్పర్శ లేనంతగా చావు బతుకుల మధ్య ఓ అభాగ్యుడు. అటుగా వెళుతున్న సినీ కళాకారుడు హేమంత్‌కుమార్‌ ఈ సంఘటన చూసి చలించిపోయారు. దగ్గరికి వెళ్లి చూశాడు. కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. మరో ఇద్దరుముగ్గురు సాయం తీసుకున్నారు. 108కు ఫోన్‌ చేశారు. వెంటనే హైదరాబాద్‌(108 కాల్‌సెంటర్‌) నుంచి నేరుగా ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గోపట్టణ పోలీసులు స్పందించి సంఘటన ప్రాంతానికి రక్షక్‌ ద్వారా వచ్చారు. వారు కూడా 108 అంబూలెన్స్‌కు ఫోన్‌ చేశారు. వన్‌టౌన్‌ పరిసర ప్రాంతాల్లో 108 వాహనం ఉందని చెప్పడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ల సాయంతో చావుబతుకుల మధ్య ఉన్న అభాగ్యుడ్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనంతా దాదాపు గంటన్నర పాటు సాగింది. ప్రస్తుతం ఆ అభాగ్యుడు కేజీహెచ్‌లో కోలుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement